తెలుగు ప్రేక్షకులకే కాదు.. దేశంలోని అన్ని భాషల వారికి, బాలీవుడ్ నుంచి ఇతర దేశాలలో కూడా ‘బాహుబలి’ సిరీస్ చూసిన వారికి యంగ్‌రెబెల్‌స్టార్ ప్రభాస్ అంటే ఉన్న క్రేజ్‌ని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ ఒక్క రెండు భాగాల సిరీస్‌తోనే ఆయన నేషనల్, ఇంటర్నేషనల్ ఐకాన్‌గా మారాడు. ‘బాహుబలి-ది బిగినింగ్, బాహుబలి-ది కన్‌క్లూజన్’ల కోసం ఏకంగా ఐదేళ్లు ధారబోసి, రాజమౌళిపై ఉన్న నమ్మకంతో, భారీ పారితోషికం తీసుకుని, కథ మీద ఉన్న ఆసక్తితో ఈ చిత్రాన్ని ఆయన చేశాడు.
కానీ తాను ‘బాహుబలి’ సిరీస్ చేయడానికి కారణం ఇవి మాత్రం కాదని, అంతకన్నా ఓ పెద్ద విషయం వల్లే తాను అందులో నటించానని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. ప్రభాస్ తండ్రి కీర్తిశేషులు ఉప్పలపాటి సూర్యనారాయణరాజుకి తన కుమారుడు ప్రభాస్‌ని రారాజుగా చూడాలనే కోరిక ఉండేదట. దీనిని పలుసార్లు ఆయన నాకు చెప్పారు. దాంతోనే ‘బాహుబలి’ చిత్రం కథ నా వద్దకు వచ్చిన వెంటనే అందులో నేను చేసేది రాజు గారి పాత్ర కావడంతో మరో మాటకి, ఆలోచనకు తావివ్వకుండా నేను ఒకే చేశానని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.
కానీ దురదృష్టం ఏమిటంటే.. ఈ చిత్రాన్ని చూడకుండానే ప్రభాస్ తండ్రి మరణించాడు. 2010 ఫిబ్రవరి 12న ఆయన స్వర్గస్తులయ్యారు. అయినా ప్రభాస్ మాత్రం తన తండ్రి మరణించిన తర్వాత కూడా ఆయన మాటను నిలబెట్టేందుకు ఎంతో కృషి చేసి నేడు నేషనల్ స్టార్ అయ్యాడు. అయితే ప్రభాస్‌ని నేడున్న స్టేజీలో ఆయన తండ్రి ప్రత్యక్షంగా చూడకపోవడం పెద్ద లోటేనని చెప్పాలి. ఇక ‘బాహుబలి’తో పెరిగిన తన స్టామినా, మార్కెట్, క్రేజ్‌కి అనుగుణంగా ప్రస్తుతం ఆయన హాలీవుడ్ యాక్షన్ చిత్రాలను మరిపించే విధంగా, భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఫాంటసీ చిత్రం ‘సాహో’లో, పీరియాడికల్ లవ్‌స్టోరీగా రూపొందుతున్న జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నాడు.
ప్రభాస్ ఎదుగుదలను ఆయన తండ్రి చూడలేకపోయినా, ఆయన పెదనాన్న కృష్ణంరాజు మాత్రం చూసి ఆనందిస్తున్నాడు. ప్రభాస్ నిజజీవితంలో కూడా రాజేనన్న విషయం తెలిసిందే. అయితే ఎవరైనా తనని ప్రభాస్ అని గాక రాజుగారు అని పిలిస్తే ప్రభాస్ ఎంతో సిగ్గుపడి పోతాడని ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.