Advertisement
Google Ads BL

ఈ సినిమాకి ఇప్పట్లో తిరుగేలేదు..!


గత నెలలో సూపర్ హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో స్టార్ హీరోల సినిమాలను మట్టి కరిపించిన ఎఫ్ 2 సినిమా అలా అలా కలిసొచ్చేస్తుంది. ఇప్పటికి ఎఫ్ 2 ఆడుతున్న థియేటర్స్ లో ప్రేక్షకులు నిండుగా కనిపిస్తున్నారు అంటే... ఈనెల రోజులుగా ఎఫ్ 2 కి పోటీ ఇచ్చే సినిమా ఏది ఎఫ్ 2కి తగ్గలేకపోవడమే. కథానాయకుడు, వినయ విధేయ రామ సినిమాలను పక్కకు నెట్టి మరీ ఎఫ్ 2 ఒక రేంజ్ లో కలెక్షన్స్ కోల్లగొట్టి 100 కోట్ల క్లబ్బులో చేరిందని.. ఆ సినిమా నిర్మాత దిల్ రాజే స్వయంగా ప్రకటించాడు. ఇక సంక్రాంతి సినిమాలను పక్కనబెడితే.. జనవరి మూడో వారంలో ఎలాంటి సినిమా లేకపోవడంతో ఎఫ్ 2 కలెక్షన్స్ పెరగడానికి కారణమయ్యింది. మరోపక్క అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను కూడా జనవరి చివరి వారంలో విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో.. ఎఫ్ 2 మళ్ళీ రెచ్చిపోయింది.

Advertisement
CJ Advs

ఇక ఫిబ్రవరి 1 న కూడా ఎలాంటి సినిమా బాక్సాఫీసు దగ్గరకు రాలేదు. ఇక అప్పటికి ఎఫ్ 2 థియేటర్స్ లో ఫుల్ అవుతూనే ఉంది. ఇక గతవారం యాత్ర సినిమా బావున్నప్పటికీ... సినిమాకి కొంతమంది ప్రేక్షకుల సపోర్ట్ మాత్రమే దొరకడంతో ఎఫ్ 2 హవా కొనసాగింది. ఇక ఎఫ్ 2 విడుదలైన నెలరోజులకు డిజిటల్ హక్కులు కొన్న అమెజాన్ ప్రైమ్ వారు ఆన్ లైన్ లో రిలీజ్ చేసేసారు. ఇక అమెజాన్ లో ఎఫ్ 2 రిలీజ్ అయినప్పటికీ.. ఎఫ్ 2 థియేటర్స్ లో మాత్రం ప్రేక్షకుల హవా కొనసాగింది. 

ఇక తాజాగా నిన్నగాక మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవ్, లవర్స్ డే సినిమా టాక్ మళ్ళీ ఎఫ్ 2 కి కలిసొచ్చేలా చేసింది. కార్తీ - రకుల్ హిట్ మ్యాజిక్ ని రిపీట్ చెయ్యలేక చేతులెత్తేస్తే... ప్రియా క్రేజ్ టోన్ సినిమా ఆడదని లవర్స్ డే సినిమా ప్రూవ్ చేసింది. అలా ఈ వారానికి కూడా ప్రేక్షకుడికి ఏకైక ఆప్షన్ ఎఫ్ 2 నే కనబడుతుంది. మరి అందరికి ఆమెజాన్ ప్రైమ్ అందుబాటులో ఉండదుగా.. అందుకే కొంతమంది థియేటర్స్ కి వెళ్ళక తప్పదు.. అది కూడా ఎఫ్ 2 ని వీక్షించేందుకు. మరి ఎఫ్ 2 కి అలా కలిసొచ్చేసింది అంతే.    

F2 Creates Sensation at Box Office:

No Change in F2 Collections
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs