Advertisement
Google Ads BL

‘మహానాయకుడు’ హడావుడి ఏది..?


ఎన్టీఆర్ కథానాయకుడు హిట్ అయితే కథ వేరేలా ఉండేది. కానీ అది జరగలేదు. సినిమా డిజాస్టర్ అయింది. దాంతో మహానాయకుడు రిలీజ్ చిక్కుల్లో పడింది. చాలా రోజులు డిస్ట్రిబూటర్స్‌తో సెటిల్మెంట్ తరువాత రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈనెల 22న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అంత బాగానే ఉందిగానీ.. ఈ సినిమాపై బాలయ్య ఫ్యాన్స్‌లో పెద్దగా ఆసక్తి కనబడటం లేదు. అలానే టీం నుండి కూడా ఎటువంటి బజ్ లేదు.

Advertisement
CJ Advs

కథానాయకుడు సినిమాకు రోజుకో పోస్టర్ అన్నట్లుగా హడావుడి చేశారు. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. సినిమా విడుదల దగ్గర పడుతున్న సమయంలో మేకర్స్ లో టెన్షన్ పెరుగుతుంది. ఈ నెలే రిలీజ్ అవ్వడానికి కారణం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల చివరి వారం లేదా మార్చ్ మొదటి వారం రావడం ఖాయం అని తేలింది. అందుకే ఈలోపే సినిమా రిలీజ్ కాకపోతే తెలుగు దేశం పార్టీ‌కి పెద్దగా కలిసొచ్చేదేమీ ఉండదు.

ఎలక్షన్స్ తరువాత రిలీజ్ చేస్తే ఏమి ఉపయోగం ఉండదు.. అందుకే వేరే దారి లేక తప్పని పరిస్థితిలో 22కే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు. ఇంకా వారం టైం మాత్రమే ఉంది ఈలోగా ప్రమోషన్స్ తో హడావిడి చేసేయాలి. లేకపోతే కష్టమే. శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఈ ట్రైలర్ ఆకట్టుకుంటే.. రిలీజ్ డేట్ వరకు నో ప్రాబ్లమ్.. లేదంటే మేకర్స్ ప్రమోషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో.. మహానాయకుడి భవిష్యత్ అంతా ఈ ట్రైలర్ ‌పైనే ఆధారపడి ఉంది.

No Promotions to NTR Mahanayakudu Movie:

NTR Mahanayakudu Movie Trailer Release Time fixed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs