Advertisement
Google Ads BL

షాక్: మెగాబ్రదర్స్‌ ఆల్కహాల్‌ కహానీ!


ఒకనాడు ఆల్కహాల్‌ తీసుకునే వారు అంటే అరుదు. వారిని అందరు చీడపురుగును చూసినట్లు చూసేవారు. కానీ కాలం మారింది. నేడు ఆల్కహాలు తీసుకోని వారు అరుదుగా కనిపిస్తారు. ఆ అలవాటు లేని వారిని చూసి ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చివరకు మహిళలు కూడా సిగరెట్లు, ఆల్కహాల్‌ తీసుకోవడం కామన్‌ అయింది. ఇక సెలబ్రిటీలు అందునా సినిమా వారికి సిగరెట్‌, మద్యం అనేవి కామన్‌. ఫార్మాల్టీకైనా పార్టీలలో ఆల్కహాల్‌ తీసుకుంటూ ఉంటారు. అలాంటి అలవాట్లు లేని వారిని అరుదుగా మాత్రమే చూస్తాం. ఏయన్నార్‌ కూడా మితంగా ఆల్కహాల్‌ తీసుకునే వాడు. ఆయన లైట్‌గా మద్యం సేవించమని మురళీమోహన్‌కి కూడా సూచించాడు. కానీ ఫుల్‌బిజీగా ఉండే రోజుల్లో మురళీమోహన్‌ తాను మద్యం జోలికిపోలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే తాజాగా మెగాబ్రదర్‌ నాగబాబు తన సోదరుల ఆల్కహాల్‌ కహాని ఓపెన్‌గా చెప్పాడు. ఆయన మాట్లాడుతూ, అన్నయ్య చిరంజీవి అరుదుగా ఆల్కహాల్‌ తీసుకుంటారు. కేవలం పార్టీలలో మాత్రమే ఆయన మద్యం సేవిస్తారు. పార్టీల సందర్భంగా కూడా ఆయన చాలా మితంగా ఆల్కహాలు తీసుకుంటారు. పవన్‌ మాత్రం మరీ తక్కువగా ఆల్కహాల్‌ తీసుకుంటాడు. నేను కూడా ఒకనాడు బాగానే మద్యం తీసుకునే వాడిని. కానీ ఆరోగ్య పరిస్థితుల వల్ల దానికి దూరంగా ఉన్నాను. ఇక నాకు సిగరెట్‌ తాగడం కూడా ఇష్టమే. కానీ హెల్త్‌ దృష్ట్యా దానిని కూడా పక్కనపెట్టానని చెప్పుకొచ్చాడు. ఈ విషయాలు వింటుంటే ఓ విషయం గుర్తుకు వస్తుంది. 

గతంలో ఓ బుల్లితెర షోలో చిరంజీవి, బ్రహ్మానందం మధ్య ఆల్కహాల్‌ టాపిక్‌ వచ్చినప్పుడు స్వర్గీయ హ్యాసబ్రహ్మ జంధ్యాల ఆల్కహల్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్లనే చిన్న వయసులోనే మరణించాడని వ్యాఖ్యానించారు. దీనిపై చిరు, బ్రహ్మానందంల మీద పెద్ద ఎత్తున్న విమర్శలు వచ్చాయి. చివరకు జంధ్యాల భార్య, కూతుర్లు కూడా దీనిపై ఘాటుగా స్పందించారు. ఒకడిని చంపినా వంద మందిని చంపినా ఒకే శిక్ష అన్నట్లుగా, ఒకసారి దొంగతనం చేసినా దొంగే అవుతాడు అన్నట్లు తాము కూడా ఆల్కహాల్‌ తీసుకుంటూ జంధ్యాలను మాత్రం తాగుబోతుగా చిత్రీకరించడం సరికాదనే చెప్పాలి. 

Naga Babu on Chiranjeevi, Pawan Kalyan Alcohol Consumption:

Mega Brothers Alcohol Connection    
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs