Advertisement
Google Ads BL

సరైన సినిమాయే లేదుగా చూద్దామంటే..!!


జనవరి వచ్చింది మొదలు... సంక్రాంతికి ఒకే ఒక్క సినిమా ప్రేక్షకులు మెచ్చేదిలా కనబడింది. అది కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఎఫ్ 2. సంక్రాంతికి విడుదలైన సినిమాలలో ఎఫ్ 2 మాత్రమే సక్సెస్ సాధించగా.. మిగతావన్నీ తుస్ మన్నాయి. ఇక జనవరి చివరి వారంలో విడుదలైన మిస్టర్ మజ్ను కూడా డిజాస్టర్ కావడంతో జనవరిలో ఒకే ఒక్క హిట్ ఎఫ్ 2 అంటూ సోషల్ మీడియాలో పలురకాల న్యూస్ లు వెలువడిన సంగతి తెలిసిందే. ఇక ఫిబ్రవరి అయినా ఆశాజనకంగా కనబడిందా అంటే అదీ లేదు. గత వారం విడుదలైన యాత్ర సినిమా అన్ని వర్గాలను మెప్పించలేకపోయింది. హిట్ టాక్ పడినా.. ఆ సినిమాతో ప్రేక్షకుడికి ఉపయోగం లేదు. 

Advertisement
CJ Advs

ఇక ఈ వారమన్నా ప్రేక్షకులు మెచ్చే సినిమాలేమన్నా వస్తాయనుకుంటే.. ఈ వారం కూడా తుస్ మంది. విడుదలవడానికి రెండు డబ్బింగ్ సినిమాలు విడుదలయ్యాయి కానీ.. రెండు సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేక చేతులెత్తేశాయి. మలయాళం నుండి ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన లవర్స్ డే ఒక సినిమా, తమిళం నుండి దేవ్ సినిమా ఒకటి విడుదలయ్యాయి. కన్నుకొట్టి ముద్దుపెట్టి.. గన్ ఎక్కుపెట్టి గుండెల్ని పిండిన ప్రియా ప్రకాష్ వారియర్ క్రేజ్ తో మలయాళ సినిమాని తెలుగులో లవర్స్ డే సినిమాగా డబ్ చేసి విడుదల చేస్తే... ఆ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. కేవలం హీరోయిన్స్ గ్లామర్, క్రేజ్ తో సినిమాలు ఆడవని లవర్స్ డే నిరూపించింది. లవర్స్ డే సినిమాలో కథ, కథనం, దర్శకత్వం, మ్యూజిక్ ఇలా అన్ని మైనస్ లే ఉండడంతో... లవర్స్ డే కథ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

ఇక తమిళ డబ్ చిత్రం ‘దేవ్’ కూడా చేతులెత్తేసింది. కార్తీ - రకుల్ ప్రీత్ కాంబోలో తెరకెక్కిన దేవ్ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఖాకీ వంటి హిట్ కాంబో రిపీట్ అవడం, కార్తీ, రకుల్ కి తెలుగులో క్రేజ్ ఉండడంతో దేవ్ మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. కానీ ప్రేక్షకుల అంచనాలు దేవ్ అందుకోలేకపోయింది. కొత్త దర్శకుడు దేవ్‌ని ఆసక్తికరంగా మలచడంలో పూర్తిగా విఫలమయ్యాడు. కథ, కథనం, ఎడిటింగ్, మ్యూజిక్ అన్ని సినిమాకి మైనస్ లే. రకుల్ అందాలు కూడా సినిమాని కాపాడలేకపోయాయి. ఇక వీక్ రివ్యూస్ తో దేవ్ కి పూర్తిగా నెగెటివ్ టాక్ పడడంతో.. ఆ సినిమాకి పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రావడం కష్టం లా కనబడుతుంది. సో ప్రేక్షకుడు ఈ వారం కూడా మంచి సినిమాలేవీ లేక ఉసూరుమనక తప్పదు.

Dev, Lovers Day.. Audience Disappointed:

No Hit Movie After F2 in Tollywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs