Advertisement
Google Ads BL

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కూడా ట్రైలర్ మాయేనా వర్మా?


లక్ష్మీపార్వతిని బేస్ చేసుకుని రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటూ ఎన్టీఆర్ అవసాన ఘట్టాన్ని తెరకెక్కిస్తున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో లక్ష్మీపార్వతిని పాజిటివ్‌గా చూపిస్తూ ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు‌నాయుడుని, నందమూరి ఫ్యామిలీ.. ఎన్టీఆర్ చివరి దశలో చేసిన కుట్రలు కుతంత్రాలను లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చూపించబోతున్నాడని.. తాజాగా ప్రేమికురాలు రోజున వదిలిన ట్రైలర్‌లో అర్ధమయ్యింది. లక్ష్మీపార్వతిని హైలెట్ చేస్తూ ఎన్టీఆర్ 1989 ఎన్నికల తర్వాత ఫ్యామిలీకి దూరమవడం, లక్ష్మీపార్వతికి దగ్గరవడం, ఆమె వలన ఎన్టీఆర్ పడిన అవమానాలు అన్నీ లక్ష్మీస్ ఎన్టీఆర్ లో రామ్ గోపాల్ వర్మ పాజిటివ్‌గా చూపించాడు. అయితే ఆ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ చూసిన లక్ష్మి పార్వతి ఉద్వేగం ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా మీడియాలో కొన్ని వార్తలొచ్చాయి.

Advertisement
CJ Advs

మరి తనని పాజిటివ్‌గా చూపించి, ఎన్టీఆర్ చివరి దశలో పడిన అవస్థలను రామ్ గోపాల్ వర్మ సినిమా రూపంలో ప్రేక్షకులకు తెలియజెబుతాడని లక్ష్మీపార్వతి చాలా ఆశపడుతున్నట్లుగా నిన్న ట్రైలర్ చూసాక ఆమె కన్నీళ్లు చెబుతున్నాయని కొంతమంది అంటున్నారు. అందుకే వర్మకి కావాల్సిన సమాచారం ఆమె రహస్యంగా అందిస్తుందని అంటున్నారు. అయితే లక్ష్మీపార్వతికి వర్మ ఎంతవరకు ఫేవర్ చేస్తాడో అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హాట్ టాపిక్. అందుకేనట ట్రైలర్‌లో చూపించినట్టుగా లక్ష్మి పార్వతిని సినిమా మొత్తం పాజిటివ్ గా చూపిస్తాడా? లేదంటే వర్మ గత సినిమాల వలే అంటే వంగవీటి లాంటి సినిమాల్లో ట్రైలర్‌లో ఒకలాగా, సినిమాలో మరోలా చూపించి బోల్తా కొట్టించినట్టుగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉండబోతుందా? 

సినిమా పూర్తయ్యి సినిమా చూసాక లక్ష్మీపార్వతి ఏం చేస్తుంది? ఆమెని హైలెట్ చేస్తూ ఎన్టీఆర్ కి దగ్గరగా ఉన్నట్టుగా సినిమా మొత్తం చూపిస్తాడా? లేదంటే హైప్ పెంచడానికని ట్రైలర్ వరకే పరిమితం చేస్తాడా? మరి వంగవీటి అనుకూలంగా సినిమా తీస్తున్నానని చెప్పి... సినిమా విడుదలయ్యాక వంగవీటి రాధాతో గొడవపెట్టుకున్నట్లుగా.... లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలయ్యాక లక్ష్మి పార్వతి కూడా వర్మ చూపించింది చూసి కన్నీళ్ళు పెట్టాల్సి వస్తుందేమో. సినిమా పూర్తయ్యి.. సెన్సార్ కి వెళ్లకముందే సినిమా చూసి ఫైనల్ చెయ్యమని లక్ష్మీపార్వతికి సన్నిహితులు చెబుతున్నారట.

Lakshmis NTR Trailer Released:

Rumours on RGV Lakshmis NTR Trailer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs