Advertisement
Google Ads BL

‘NGK’ టీజర్: గోపాలా.. రారా నాన్నా!!


‘గజిని’, ‘సింగం’ చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న హీరో సింగం సూర్య హీరోగా..  ‘7జి బృందావన కాలని, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాల దర్శకుడు శ్రీ రాఘవ దర్శకత్వంలో.. రీసెంట్‌గా ‘ఖాకి’ వంటి హిట్‌ చిత్రాన్ని అందించిన ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు ‘డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌’, ‘రిలయెన్స్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్‌లపై రూపుదిద్దుకున్న చిత్రం ‘NGK’ (నంద గోపాల కృష్ణ). తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. 

Advertisement
CJ Advs

‘నా పేరు నంద గోపాల కృష్ణ. ప్రజలు నన్ను ఎన్ జి కె అని పిలుస్తారు’ అని సూర్య చెప్పే డైలాగ్ తో మొదలయ్యే టీజర్ ఆద్యంతం ఎంతో ఉత్కంఠ రేపేలా ఉంది. సాయి పల్లవి చెప్పే ‘గోపాలా పోరా నాన్నా నువ్వెళ్తే ఎలాంటి మురికైనా శుభ్రమవుతుంది’ అనే డైలాగ్‌తో ఎన్ జి కె  హై ఓల్టేజ్ పొలిటికల్ థ్రిల్లర్ గా అలరించనుంది. సింగం సూర్యకు జంటగా సాయిపల్లవి, రకుల్ ప్రీత్ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

సూర్య, సాయిపల్లవి, రకుల్ ప్రీత్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, సినిమాటోగ్రఫీ: శివకుమార్‌ విజయన్‌, ఎడిటింగ్‌: జి.కె.ప్రసన్న, ఆర్ట్‌: ఆర్‌.కె.విజయ్‌ మురుగన్‌, నిర్మాతలు: ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, దర్శకత్వం: శ్రీ రాఘవ

Click Here for Teaser

NGK Teaser Released:

Suriya, Sai Pallavi, Rakul Preet Singh Starring NGK Teaser Talk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs