Advertisement
Google Ads BL

‘యాత్ర’ను జగన్ వాడుతున్నాడు


తొమ్మిదేళ్ల నుండి ముఖ్యమంత్రి కావాలనే కలతో ప్రజల్లోనే ఉంటూ.. ప్రజలతో అన్నట్టుగా వైసిపి నాయకుడు జగన్మోహన్ రెడ్డి... ఆఖరుకి ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి కూడా రాకుండా ప్రజా సంకల్పయాత్ర అంటూ రాష్ట్రమంతా పాద యాత్ర చేసి ప్రస్తుతం బహిరంగ సభలు అంటూ హడావిడి చేస్తున్నాడు. 2014 ఎన్నికల్లో చంద్రబాబుపై ఓడిపోయి... మళ్ళీ 2019 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని జగన్ కలలు కంటున్నాడు. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి బయోపిక్ అయిన యాత్ర సినిమాని గత రెండు రోజులక్రితం  వీక్షించి.. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర సినిమాని అద్భుతంగా తీశావంటూ ఆ దర్శకుడు మహి వి రాఘవ్ ని ప్రశంసించాడు.

Advertisement
CJ Advs

అయితే యాత్ర సినిమా చూశాక... జగన్మోహన్ రెడ్డి కి కాస్త సినిమా డైలాగ్స్ వంటబట్టినట్టుగా కనబడుతుంది. ప్రస్తుతం బహిరంగ సభల్లో పాల్గొంటున్న జగన్ ప్రజలతో మీకు నేనున్నాను అంటూ చెయ్యి ఊపడం, అలాగే చంద్రబాబు మీద ప్రతిసారి సినిమా డైలాగ్స్ అంటే... చంద్రబాబు ఒక సినిమా చూపించాడు.. 2019 ఎన్నికల సమయం దగ్గరపడుతోంది ఇప్పుడు పెన్షన్స్ పెంచి మరో సినిమా చూపిస్తున్నాడు అంటూ స్పీచ్ లిస్తున్నాడు. ఇక తండ్రి రాజశేఖర్ రెడ్డిల మమ్ముట్టి యాత్ర సినిమాలో చేసినట్టుగా జగన్ నేనున్నా... మీకు తగిలిన  గాయాలు నా గుండెకి తగిలాయి అంటూ సినిమా డైలాగ్స్ వాడేస్తున్నాడు.

YS Jagan Follows Yatra Movie:

YS Jagan Praises Yatra Movie Director
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs