Advertisement
Google Ads BL

దేవ్..డా! హిట్టివ్వమంటోన్న హీరోయిన్


ప్రస్తుతం రకుల్ ప్రీత్ కి తెలుగులో అస్సలు క్రేజ్ లేదు. స్పైడర్ పుణ్యమా అని రకుల్ తెలుగులో కనిపించకుండా పోయింది. నేను తమిళ సినిమాలు, హిందీ సినిమాల్తో బిజీగా ఉండి.. క్షణం తీరిక లేకుండా ఉన్నానని చెప్పినప్పటికీ.. రకుల్ ప్రీత్‌కి తెలుగులో సినిమాలు లేవనే విషయాన్ని సోషల్ మీడియాలో నిత్యం గుర్తు చేస్తూనే ఉంటున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ అండ్ స్లిమ్ పిక్స్ పెడుతున్నా.. స్టార్ హీరోలే కాదు... మీడియం హీరోలు కూడా రకుల్ వంక చూడడం లేదు. ప్రస్తుతం తెలుగులో రకుల్ ప్రీత్‌కి ఒకే ఒక సినిమా ఉంది. ఆ సినిమానే వెంకీ మామ. నాగ చైతన్య పక్కన మరోసారి నటించబోతుంది రకుల్. వెంకటేష్ - శ్రీయ, చైతు - రకుల్ హీరోహీరోయిన్స్ గా దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

Advertisement
CJ Advs

ఇకపోతే రకుల్ ఇప్పుడు మరో సినిమాతో తెలుగు ప్రేక్షకులముందుకు రాబోతుంది. అది కూడా తమిళ డబ్బింగ్‌తో. తమిళంలో కార్తీ సరసన నటించిన దేవ్ సినిమా తెలుగు తమిళంలో రేపు వాలంటైన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి రకుల్ ప్రీత్ కి దేవ్ సినిమా హిట్ అవడం చాలా ముఖ్యం. తమిళంలో రెండు మూడు సినిమాల్తో బిజీగా వున్న రకుల్ ప్రీత్ కి ఈ దేవ్ సినిమా హిట్ పడితే... అక్కడ మరిన్ని అవకాశాలు వస్తాయి. లేదంటే మరో అవకాశం అమ్మడు చేతికి రాదు. ఇక దేవ్ సినిమా తెలుగులోనూ బాగా ఆడితే రకుల్ కి మీడియం హీరోలైన ఛాన్స్ ఇస్తారు. లేదంటే వెంకీ మామ తోనే దుకాణం సర్దుకోవాల్సి వస్తుంది.

మరి బాలీవుడ్ లో ఓ.. అన్న రేంజ్‌లో క్లిక్ అయితేనే కానీ.. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ఇలియానా, కాజల్ లాంటి వాళ్ళని చూస్తే అర్ధమవుతుంది. బాలీవుడ్ హిట్ సినిమాల్లో నటించినా ఇలియానా అక్కడ క్లిక్ అవలేక మళ్ళీ సౌత్ కి చేరింది. ఇక రకుల్ కి కూడా అదే పరిస్థితి రాకుండా ఉండాలంటే.. ఆమెకి ఈ దేవ్ సినిమా తెలుగు, తమిళంలోనూ హిట్ పడాల్సిందే. మరి తెలుగులో రేపు విడుదల కాబోతున్న చిత్రాలలో దేవ్ కి కాస్త క్రేజ్ ఉంది. ఎలాగూ తెలుగు సినిమాలేవీ దేవ్ కి పోటీ లేకపోవడం కలిసొచ్చే అంశం. ఇక మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ ఏమన్నా పోటీ ఇస్తుందేమో అనుకుంటే... ఆమె నటించిన లవర్స్ డే కి తెలుగులో పెద్దగా క్రేజ్ కనబడడం లేదు. మరి లవర్స్ డే సంగతి ఎలా ఉన్నా.. దేవ్ కి కాస్తో కూస్తో క్రేజ్ ఉంది. మరి ఈ సోలో అవకాశాన్ని రకుల్ ఎంతవరకు క్యాష్ చేసుకుంటుందో చూడాలి.

Heroine Wants Hit Movie:

Rakul Preet Singh Waiting for Hit Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs