Advertisement

మోహన్‌బాబుని కూడా కెలుకుతున్నాడంట!


వర్మకి మంచు ఫ్యామిలీ అంటే ఎంత ఇదో.. మంచు ఫ్యామిలీకి వర్మ అంటే ఎంత అదో అందరికి తెలుసు. మరి అంత ఇదున్న మోహన్ బాబుని రామ్ గోపాల్ వర్మ తన లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో ఎలా చూపిస్తాడో చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ నానా హంగామా చేస్తూ.. ఇది కుటుంబ కుట్రల చిత్రమంటూ తెగ పబ్లిసిటీ చేస్తున్నాడు. నందమూరి ఫ్యామిలీని ఈ సినిమాతో వర్మ బాగా ఇరకాటంలో పెట్టినట్లుగా కనబడుతుంది వ్యవహారం. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్‌ థియేట్రికల్ ట్రైలర్‌ని మహానాయకుడు విడుదల రోజు ఫిబ్రవరి 22 విడుదల చేస్తూ హంగామా మొదలెట్టాడు. 

Advertisement

మరి లక్ష్మీస్ ఎన్టీఆర్‌‌లో అన్ని నిజాలే చెబుతా అంటూ బయలుదేరిన వర్మ ఇప్పుడు ఎన్టీఆర్‌తో ఎంతో అనుబంధం ఉన్న మోహన్ బాబుని తన లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో ఎలా చూపించబోతున్నాడో అనే హాట్ టాపిక్ మొదలైంది. ఎన్టీఆర్, మోహన్ బాబుకి మధ్య సన్నివేశాలను రామ్ గోపాల్ వర్మ అద్భుతంగా తెరకెక్కించాడని చెబుతున్నప్పటికీ... ఎన్టీఆర్ అవసాన దశలో మోహన్ బాబు మంచి అనుబంధాన్ని మెయింటింగ్ చేసాడు. అలాగే ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకున్నప్పుడు కూడా మోహన్ బాబు ఎన్టీఆర్‌కి, లక్ష్మి పార్వతికి బాగానే సపోర్ట్ చేసాడు. అలాగే లక్ష్మి పార్వతితోనూ మోహన్ బాబు బాగానే ఉండేవాడు.

కానీ ఎన్టీఆర్ మరణం తర్వాత మోహన్ బాబుకి లక్ష్మి పార్వతికి గ్యాప్ రావడం.. ఆ తర్వాత ఒకానొక సందర్భంలో లక్ష్మి పార్వతి.. మోహన్ బాబుని దుర్మార్గుడు అంటూ మీడియా ముందు అనడం... వంటి వాటిని రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చూపించబోతున్నాడట. అలాగే లక్ష్మి పార్వతి అలా ఎందుకు అనాల్సి వచ్చిందో కూడా తెర మీద వర్మ చూపించబోతున్నాడట. మరి మోహన్ బాబుని లక్ష్మి పార్వతి తిట్టడం వంటి సీన్స్ ని నెగెటివ్ గా చూపించాల్సి వస్తుంది. మరి ఎంతో అనుబంధం ఉన్న వర్మ,  మోహన్ బాబుతో ఎలా పెట్టుకుంటాడో అనేది ఇప్పుడు ఫిలింసర్కిల్స్ లో నడుస్తున్న హాట్ టాపిక్.

Mohan Babu Role in Lakshmis NTR:

RGV Targets His Friend Manchu Mohan Babu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement