Advertisement
Google Ads BL

స్వీటీకి మరొకరితో లింక్ పెట్టేశారు..!


సినిమా రంగమంటేనే గాసిప్స్‌, రూమర్స్‌కి కేరాఫ్‌ అడ్రస్‌. ఇక హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ సోషల్‌మీడియా లేని రోజుల్లో ‘తార-సితార’ వంటి కొన్ని మేగజైన్స్‌లో మాత్రమే వీటికి చోటుండేది. నేడు సోషల్‌మీడియా విస్తారమైన నేపధ్యంలో కుగ్రామాల నుంచి విశ్వవాప్తంగా తెలుగు వారు ఎక్కడ ఉన్నా కూడా వారి కామెంట్స్‌ అందరికీ తెలిసిపోతున్నాయి. ఇక అనుష్క విషయానికి వస్తే ఆమెని నాగార్జునతో, గోపీచంద్‌తో మొదటి రోజుల్లో లింక్‌లు అంటగట్టారు. ఆ తర్వాత ‘బిల్లా, మిర్చి’లే కాకుండా ఏకంగా ఐదేళ్ల పాటు ‘బాహుబలి’కి కలిసి పనిచేయడంతో ప్రభాస్‌తో సంబంధాన్ని మన నెటిజన్లే ఖరారు చేశారు. దీనిపై మండిపడిన స్వీటీ మరలా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించినా కూడా పరిస్థితి మారలేదు. 

Advertisement
CJ Advs

ఏకంగా ‘కాఫీ విత్‌ కరణ్‌’లో కూడా ప్రభాస్‌కి ఇదే ప్రశ్న ఎదురవ్వడం చూస్తుంటే తెలుగువారే కాదు... దేశవ్యాప్తంగా ప్రభాస్‌-అనుష్క జోడీపై ఎలాంటి అభిప్రాయం ఉందో అర్ధమవుతుంది. ఇక స్వీటీ విషయానికి వస్తే నయనతార తర్వాత ఈమెని లేడీ సూపర్‌స్టార్‌గా చెప్పవచ్చు. గ్లామర్‌ పాత్రలు, స్టార్‌ హీరోల సరసన చేయడమే కాదు.. లేడీ ఓరియంటెడ్‌ చిత్రాల ద్వారా కూడా ఈమె స్టార్‌ హీరోలకు ధీటుగా విజయాలు సాధిస్తోంది. ఇక విషయానికి వస్తే ‘సైజ్‌జీరో’ చిత్రం పుణ్యమా అని ఈ యోగా టీచర్‌ బొద్దుగా లావుగా మారిపోయింది. కేరళలో పాటు అనేక దేశాలలో నేచురల్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకున్నా ప్రయోజనం లభించలేదు. తాజాగా ఆమె ఆస్ట్రియా వెళ్లి నేచురల్‌ ట్రీట్‌మెంట్‌ ద్వారా మరలా స్లిమ్‌గా తయారైంది. 

ఈమె సముద్రపు ఒడ్డున్న ఓ బండరాయిపై సింపుల్‌గా వైట్‌ డ్రస్‌లో కూర్చుని, డిపరెంట్‌ హెయిర్‌స్టైల్‌తో అదరగొట్టే స్మైల్‌ ఇచ్చింది. ఇది బాగా వైరల్‌ అవుతున్న నేపధ్యంలో ఆమె అదే లోకేషన్‌లో దిగిన మరో ఫొటో చర్చనీయాంశం అయింది. ఆమె పక్కన ఓ విదేశీ యువకుడు ఉన్నాడు. దాంతో ఒక్కసారిగా అనుష్కకి ఆమె కాబోయే భర్త అంటూ వార్తలు వచ్చేశాయి. కానీ నిజం ఏమిటంటే అనుష్క బరువును తగ్గించిన న్యూట్రిషియన్‌ అతను. అతని పేరు ల్యూక్‌ కోటినో. మరి గురువులాంటి అతనితో ఆమెకి సంబంధం అంటగట్టడంపై అనుష్క ఈసారి ఎలా మండిపడుతుందో వేచిచూడాల్సివుంది...! 

Again Rumours on Anushka Shetty:

Anushka Shetty Latest Photo Creates Sensation
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs