మనది ప్రజాస్వామ్య దేశం. వాక్‌స్వాతంత్య్రంతో పాటు ఏ ప్రాంతానికైనా, ఏ చోటికి అయినా వెళ్లే హక్కు ఉంది. కానీ కొన్నిసార్లు పరిస్థితులు దీనికి వ్యతిరేకంగా ఉంటాయి. దానికి ఐదారేళ్ల కిందట ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా సమైక్యాంద్ర పోరు జరుగుతున్న సమయంలో సమైక్యవాధులు హైదరాబాద్‌లో సభ పెట్టారు. కానీ ఆ సభకి తెలంగాణ వాదుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. వేదికపైకి రాళ్లు, చెప్పులు కూడా విసిరారు. నాడు ఇంకా తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. కానీ ఈ సభ వల్ల ఉద్రిక్తలు చెలరేగుతాయనే ఉద్దేశ్యంతోనే కొందరు సభ పెట్టడం మంచిది కాదని సలహా ఇచ్చారు.
ఇక విషయానికి వస్తే మోదీ తాజాగా గుంటూరు వచ్చి సభ పెట్టాడు. ఏపీకి ఎన్నో హామీలనిచ్చిన మోదీ దేనిని నెరవేర్చలేదని, ఆయననకు ఏపీకి వచ్చే నైతిక హక్కులేదని టిడిపి, వామపక్షాల వారు నిరసన వ్యక్తం చేశారు. కేవలం మట్టి, నీరు మాత్రమే ఇచ్చారని కుండలతో నిరసన తెలిపారు. ఇక అమిత్‌షా ఏపీకి వచ్చినప్పుడు కూడా సభ జనాలు లేక వెలవెల పోయింది. తాజాగా మోదీ సభ పరిస్థితి కూడా అదే. ఇక ఏకంగా తన మనుషులను దాదాపు 500 మందిని మోదీ స్వయంగా గుంటూరు తెచ్చాడనే వాదన వినిపిస్తోంది. మరోవైపు మోదీ సభకు పవన్, జగన్‌లు జన సమీకరణ చేశారని కూడా వార్తలు వచ్చాయి. మరోవైపు మౌనంగా ఉండాల్సింది పోయి సోమువీర్రాజు, జీవీఎల్ నరసింహులు, రాంమాధవ్ వంటి వారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. సభను అడ్డుకుంటే ప్రభుత్వం ఉండదని, ప్రభుత్వాన్ని కూల్చేసి, గవర్నర్ పాలన లేదా రాష్ట్రపతి పాలన పెడతామనేది వారి వ్యాఖ్యల మర్మం.
ఏపీ ప్రత్యేక హోదా కమిటి నాయకుడైన సినీ నటుడు శివాజీ గతంలో ‘ఆపరేషన్ గరుడ’ గురించి వివరించాడు. ఆ తర్వాత ఆయన విదేశాలకు పారిపోయాడని, ఆయన వస్తే అరెస్ట్ చేసి, విచారణ చేస్తామని బిజెపి నాయకులు అన్నారు. తిట్టడం మీకే కాదు.. నేను కూడా పల్నాడు వాడినే.. మీ కంటే ఎక్కువ బూతులు మాట్లాడగలనని శివాజీ కౌంటర్ ఇచ్చాడు. తాజాగా ఆయన మరోసారి బిజెపిపై, బిజెపి నాయకులపై మండిపడ్డాడు. ఆయన మాట్లాడుతూ, మోదీ తన దరిద్రపు కాలు ఏపీలో పెట్టారు కాబట్టే నేను కృష్ణనదిలో జలదీక్ష చేశాను. మోదీ వంటి రాజకీయ తీవ్రవాదిని దేశం నుంచి బహిష్కరించే రోజు దగ్గరలోనే ఉంది. రాఫెల్ కుంభకోణం, రైతుల ఇన్సూరెన్స్ డబ్బులను కూడా మోదీ తినేశారు. మోదీ పర్యటనను అడ్డుకుంటే ప్రభుత్వాన్ని కూల్చేస్తామని జీవిఎల్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. జీవీఎల్‌కి ఎంతో మాట్లాడాలని ఉంటుంది. కానీ మాట్లాడాలంటే ఆయనకు దడ. లోపల బిపీ, షుగర్ ఇలా అన్ని ఉన్నాయి. ఏదో సొల్లు చెబుతూ ఉంటాడు.
దమ్ముందా? అని అడుగుతుంటాడు. దమ్మేంటి? నీకు దమ్ముంటే విజయవాడకి రా.. నేను ఒంటరిగానే వస్తాను. తేల్చుకుందాం.. నీవు తిరిగి వెళ్లావేమో చూద్దాం...ప్రధాని మోదీ సభకు వెళ్లిన వారిలో వేరే పార్టీ కార్యకర్తలున్నారు. మోదీ రాక సమయంలో వైసీపీ, జనసేనల నిరసన ఎక్కడా లేదు...గతంలో మట్టి, కుండ ఇచ్చిన మోదీ ఈసారి ఆయిల్, గ్యాస్ తెచ్చారు. ఆయిల్‌ని ఏపీ ప్రజలకు పూసి, గ్యాస్‌ని తీసుకుని పోవడానికే మోదీ వచ్చారు. ఆయన తమిళనాడులో సినీ నటుల చేత పార్టీలు పెట్టించారు. కేరళలో అయ్యప్పస్వామి పేరుతో మత ఘర్షణలు రెచ్చగొట్టారు. ఈ పార్టీలన్ని మోదీకి బానిసలే అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.