స్టార్ హీరోలు, అద్భుతమైన ఇమేజ్, క్రేజ్ ఉన్న స్టార్స్ చిత్రాల విషయంలో ప్రతి విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. హీరోల ఇమేజ్‌కి దగ్గ క్యాస్టింగ్‌తో పాటు సాంకేతిక నిపుణుల ఎంపికలో ఎంతో కేర్‌గా ఉండాలి. మరీ ముఖ్యంగా స్టార్స్‌కి సరిపడా హీరోయిన్లు, విలన్ వంటి పాత్రల ఎంపిక కీలకం అవుతుంది. ఇలా ప్రతి విషయాన్ని ఎంతో ఆలోచించి అడుగులు వేసే దర్శకుల్లో టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళికి మొదటిస్థానం దక్కుతుంది. అందుకే ఆయనను జక్కన్న అని పిలుస్తారు. ఒక స్టార్‌తో చేసేటప్పుడే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే, ఏకంగా అసలుసిసలు మల్టీస్టారర్‌గా, ఇద్దరు సమాన వయసు, ఇమేజ్ ఉన్న వారితో తీసే చిత్రం విషయంలో మరెన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అది ఎంత కష్టమైన ఛాలెంజో అందరికీ తెలిసిందే.
రాజమౌళి చిత్రాలలో హీరోయిన్లు, విలన్ల ఎంపిక కూడా అద్భుతంగా ఉంటుంది. ‘బాహుబలి’ చిత్రంలో కూడా విలన్‌గా నటించిన భళ్లాలదేవ రానా పాత్ర సూపర్‌గా ఉంటుంది. హీరో ప్రభాస్‌కి సరితూగే పాత్రలో, తన గొయ్యిని తానే తవ్వుకునే విధంగా రానాని చూపించాడే గానీ ప్రభాస్ విలన్‌ని చితకొట్టి చంపేలా చూపించలేదు. ఇదే విషయమై ఇటీవల సీనియర్ నటుడు సుమన్ ఈ పాత్ర గురించి, జక్కన్న గురించి ఎంతో గొప్పగా చెప్పాడు.
ఇక విషయానికి వస్తే ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ రెండో షెడ్యూల్ కూడా వేగంగా జరుగుతోంది. కానీ ఇందులో ఎన్టీఆర్, చరణ్, సముద్రఖని వంటి వారు నటిస్తున్నారని తప్ప ఇతర ఏ విషయాలు బయటకు రావడం లేదు. హీరోయిన్లుగా అలియాభట్, శ్రీదేవి కుమార్తె జాన్వికపూర్, పరిణితి చోప్రా వంటి వారిని పరిశీలిస్తున్నారట. ఇక ఇద్దరు స్టార్ హీరోలకు సరిపడా విలన్ అంటే దానిని ఊహించడమే కష్టమని చెప్పాలి. కాగా ‘ఆర్‌ఆర్‌ఆర్’లో ‘కేజీఎఫ్’ స్టార్ యష్ పేరు కూడా పరిశీలనలో ఉందనే వార్తలు వచ్చాయి. కానీ వీటిని ఆయన కొట్టి పారేశాడు. ఎందుకంటే ‘ఈగ’ చిత్రంలో కిచ్చాసుదీప్‌ని విలన్‌గా చూపించి మెప్పించిన ఘనత రాజమౌళిది.
తాజాగా విలన్ పాత్రకు ఆయన బాలీవుడ్ స్టార్ అజయ్‌దేవగణ్‌ని పెట్టుకోవాలని భావించాడని, కానీ ఇటీవలే శంకర్ ‘భారతీయుడు2’ని కూడా రిజెక్ట్ చేసిన అజయ్‌దేవగణ్ రాజమౌళికి కూడా నో చెప్పాడట. నిజానికి ‘ఈగ’ చిత్రానికి బాలీవుడ్‌లో అజయ్, కాజోల్ వాయిస్‌ని ఇచ్చారు. ఆ సన్నిహితంతో దేవగణ్‌ని అడిగితే నో చెప్పాడని, దాంతో ఈ ఆఫర్ ‘2.ఓ’లో నటించిన అక్షయ్‌కుమార్‌కి వెళ్లిందని సమాచారం. అక్షయ్ ఒప్పుకుంటే ఇక ఈ మూవీకి బాలీవుడ్‌లో కూడా తిరుగే ఉండదని చెప్పాలి.