Advertisement
Google Ads BL

లక్ష్మీస్ ఎన్టీఆర్.. చెమటలు పుట్టిస్తోంది


వాలంటైన్స్‌డే స్పెష‌ల్ గా కుట్రపూరితమైన ప్రేమ‌క‌థ‌ను చూపించ‌బోతున్న ఆర్జీవి. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైల‌ర్ విడుద‌ల 

Advertisement
CJ Advs

ప‌దవులు పోయినా, ప్రాణాలు పోయినా, అయిన వారు వద్దూ వద్దన్నా ల‌క్ష్మి పార్వ‌తి చేయి వ‌ద‌ల‌ని ఎన్టీఆర్ ప్రేమ‌, అనే క‌థను వాలంటైన్స్ డే సంద‌ర్భంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ట్రైలర్ రూపంలో ఒక బండరాయి విసరబోతున్నాడు ఆర్జీవి. ‘ఇది కుటుంబ కుట్ర‌ల చిత్రం’ అనే ట్యాగ్‌లైన్‌తో రాంగోపాల్ వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేసిన పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవ్వటమే కాదు.. చాలామందిలో చెమటలు పుట్టిస్తోంది. 

ఈ క‌థ‌ను ముందెన్నడూ వ‌ర్మ చూడని విధానం, తీయని విధానంలో  ప్ర‌త్యేకంగా ఉంటుంద‌ని తెలియని వాళ్ళు కూడా చెప్తున్నారు. తెలుగు ప్ర‌జ‌ల‌కు ఆరాధ్య దైవంగా, తెలుగు ఖ్యాతిని న‌లుదిశ‌లా చేర‌వేసిన ఎన్టీఆర్ లోలోపలి లోని ఒక నిర్వీర్యమైన ప్రేమ‌క‌థ‌ను ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్’లో ఆవిష్క‌రించ‌బోతున్నాడు రాంగోపాల్ వ‌ర్మ‌. తుది శ్వాస వ‌ద‌లే వ‌ర‌కూ ల‌క్ష్మీ పార్వ‌తి తన గౌర‌వాన్ని కాపాడిన ఎన్టీఆర్ జీవితంపై ఆమె ఎలాంటి ప్ర‌భావం చూపించలేదు..? లక్ష్మీ కోసం తనవి అన్నీ పణంగా పెట్టి పోరాడిన ఎన్టీఆర్, ల‌క్ష్మీ పార్వ‌తి ల మధ్య అతి రహస్య సంబంధం ఏంటి? విడ‌దీయ‌రాని ఆ అపవిత్ర బంధం ఏంటి? ఇలాంటి అంశాలు కొంద‌రికి రుచించ‌క‌పోయినా, అవి తెలుగుప్ర‌జ‌ల‌ గొంతుల్లోకి దిగాల్సిన అవసరముంది కనుకనే ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్’ ఆయన కుటుంబ స‌భ్యుల‌కు, న‌మ్మ‌కంగా లేని అనుచ‌రుల‌కు, వెన్నుపోటుపొడిచిన కుట్ర దారుల‌కు లక్ష్మీస్ ఎన్టీఆర్ ముందుపోటులా ఉంటుంది. 

రాంగోపాల్ వ‌ర్మ చెప్ప‌బోయే ఈ క‌థ, ఎన్టీఆర్ మంచి విషయాలే కాదు, తన సొంత ఫ్యామిలీ వాళ్ళు చేసిన చెప్పుకోలేని పనులను కూడా అడ్డుకోలేని ఎన్టీఆర్ అమాయకత్వాన్ని చూపెట్టబోతోంది. అందుకే ఈ క‌థ నిజాల‌నే కత్తులతో మూకుమ్మడి దాడి చేయబోతోంది. తెలిసిన క‌థ‌లో తెలియ‌ని కథనాన్ని వెలికితీయ‌బోతుంది. త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్దం అవుతున్న ఎన్టీఆర్ అస‌లు క‌థ తెలుగు తెర‌పై లక్ష్మీ ఆటం బాంబులను పేల్చడానికి సిద్దం అవుతోంది. 

వెలుగులు పంచిన వ్య‌క్తి చుట్టూ అలుముకున్న చీక‌ట్ల‌ను తెర‌మీద‌కు తీసుకొస్తున్నాడు వ‌ర్మ‌.. ఈ సినిమా ఎలా ఉండబోతోందో తెలిపే ట్రైలర్ ను ఫిబ్రవరి 14 న ఉదయం 9 గంటల 27 నిమిషాలకు చాలా మంది వీపులలో గుచ్చబోతున్నాడు రామ్ గోపాల్ వర్మ.

Lakshmis NTR Traile Release date fix:

RGV Reveales Lakshmis NTR trailer Date
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs