Advertisement
Google Ads BL

బాలా.. కూల్‌గా క్లారిటీ ఇచ్చాడు


తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. దాంతో ఈసినిమాను తమిళంలో విక్రమ్ కుమారుడు ధృవ్ ని హీరోగా పెట్టి సీనియర్ దర్శకుడు బాలా ఈచిత్రాన్ని తెరకెక్కించాడు. దాదాపు సినిమా మొత్తం కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నప్పుడు ఈ సినిమాను చూసిన ప్రొడ్యూసర్స్ కి ఈ మూవీ నచ్చకపోవడంతో ఈ సినిమాను ఆపేసి డైరెక్టర్ మార్చి మరో వెర్షన్ ని తీయాలని ప్రకటించడంతో ఇది సెన్సేషనల్ అయిన సంగతి తెలిసిందే.

Advertisement
CJ Advs

తమిళంలో అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న బాలా తీసిన సినిమాను ఇలా స్క్రాప్ లాగా పడేయటం ఆయనకు ఇది పెద్ద అవమానమే. మరి దీనిపై డైరెక్టర్ బాలా ఏం మాట్లాడతారో అనుకున్నప్పుడు శనివారం సాయంత్రం పెదవి విప్పారు. ఈ వివాదంకి ఫుల్ స్టాప్ పెట్టాడు.

‘వర్మ’ నిర్మాతల వెర్షన్ ప్రకారం వాళ్లే బాలాను తప్పించారు. కానీ బాలా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో మాత్రం తానే ఈ సినిమా నుంచి బయటికి వచ్చేశానని స్పష్టం చేశాడు. తనకు ప్రొడ్యూసర్స్ కు మధ్య జరిగిన ఒప్పంద పత్రాన్ని కూడా ఆయన బయటపెట్టారు. ఈ మూవీతో ఆయన భాగస్వామ్యం తెంచుకున్నట్లుగా జనవరి 22నే అగ్రిమెంట్ జరిగింది. ఈ విషయాన్నీ  బాలా ప్రెస్ నోట్లో ప్రస్తావించాడు. 

తన క్రియేటివ్ ఫ్రీడమ్ ను కాపాడుకోవడానికే ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చానన్నాడు. ధృవ్ భవిషత్తు దృష్టిలో పెట్టుకుని ఇంకా ఏమి మాట్లాడుకోవాలి అనుకోవడం లేదని ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాడు.

Varmaa’s Director Press Note against Producers:

Varmaa Director Lashes out Producers Allegations
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs