Advertisement
Google Ads BL

మహేష్ తర్వాత ప్లేస్ ఈ హీరోదే


అర్జున్ రెడ్డి సినిమా ఏ ముహూర్తాన స్టార్ట్ చేశారో కానీ అప్పటి నుండి విజయ్ దేవరకొండ ఫేట్ మారిపోయింది. సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అప్పటి నుండి మనోడు వరుస సినిమాలతో బిజీ అయ్యిపోయాడు. గీత గోవిందం సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావడంతో మనోడి మార్కెట్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఇక ప్రస్తుతం విజయ్ ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కె.ఎస్. రామారావు నిర్మిస్తున్న సినిమాలోనూ నటిస్తున్నాడు. 

Advertisement
CJ Advs

ఒక పక్క ఈ రెండు సినిమాలతో బిజీగా ఉంటూనే కొన్ని క్రేజీ బ్రాండ్ లకు అంబాసిడర్ గా బిజీ అయిపోతున్నాడు. రీసెంట్ గా సంగీతా మొబైల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా సంతకం చేసిన విజయ్ దీని కోసం రూపొందించిన యాడ్ లో నటించాడు. ఈ యాడ్ లో విజయ్ తో పాటు వెన్నెల కిషోర్ కూడా నటించాడు. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇందులో వెన్నెల కిషోర్ మేకగా కనిపించడం ఆకట్టుకుంటోంది.

టాలీవుడ్ లో మహేష్ బెస్ట్ బ్రాండ్ అంబాసిడర్ గా పేరు మార్మోగిపోతోంది. ఆ తరువాత స్థానంలో బన్నీ- ఎన్టీఆర్ - చరణ్ లు ఉన్నారు. వీరి తరువాత స్థానంలో విజయ్ దేవరకొండ ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న ఊపు చూస్తుంటే మహేష్ తరువాత స్థానంలో విజయ్ నే అంటున్నారు విశ్లేషకులు. వాణిజ్య ప్రకటనల విషయంలో దేవరకొండ ఒక్కో కమిట్ మెంట్ కి ఏడాదికి రూ.2-3 కోట్లకు పైగానే డిమాండ్ చేస్తున్నాడట. అంత చెబుతున్న మనోడితో యాడ్స్ చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. 

Young Hero in After Mahesh Babu Place:

Vijay Deverakonda in Full Swing
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs