బుల్లితెర మీద హాట్ యాంకర్ గా ఒక ఊపు ఊపిన అనసూయ భరద్వాజ్. వెండితెర మీద కూడా చక్రం తిప్పుదామనుకుంది. వెండితెర మీద హీరోయిన్స్ క్యారెక్టర్స్ తో చెలరేగిపోదామనుకుంది. అందుకే హీరోయిన్స్ తో పోటీగా హాట్ ఫోటో షూట్స్ చేస్తూ అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఎంతగా హాట్ యాంగిల్ చూపించినా ఇద్దరు పిల్లల తల్లికి ఎలాంటి క్యారెక్టర్స్ ఇస్తారో అవే క్యారెక్టర్స్ అనసూయకు రాస్తున్నారు దర్శకులు. గ్లామర్ డాల్ గా ఎంతగా అందాలు చూపించినా తల్లి తల్లేగా అన్నట్టుగా అనసూయ వెండితెర కెరీర్ కనబడుతుంది. రంగస్థలంలో డీ గ్లామర్ రోల్ తో రంగమ్మత్తగా అలరించిన అనసూయ విన్నర్, ఎఫ్ 2 సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తోనూ వగలు పోయింది.
విన్నర్ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.. అనసూయ కనబడకుండా పోయింది. ఇక ఎఫ్ 2 సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది కానీ.. ఆ సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్ పై ఎక్కడా టాకింగ్ లేదు. అలాగే క్షణం సినిమాలో పోలీస్ అధికారిగా అదరగొట్టిన అనసూయకి మళ్ళీ అలాంటి క్యారెక్టర్స్ తప్ప అంతగా ప్రాధాన్యమున్న క్యారెక్టర్స్ మాత్రం రావడం లేదు. రెండు మూడు సినిమాల్లో కీలక పాత్ర పోషించిన అనసూయ.. ఆ సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయో అనసూయకే క్లారిటీ లేదు. ఇక తాజాగా విడుదలైన యాత్ర సినిమాలో అనసూయ ఎలాంటి గెటప్ లో కనబడుతుందో అని ఆశపడిన అభిమానులకు అనసూయ చాలా చిన్నపాటి క్యారెక్టర్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొన్నటివరకు యాత్రలో పెద్ద క్యారెక్టర్ ఏదో చేసినట్టుగా బిల్డప్ ఇచ్చిన అనసూయ.. యాత్రలో ఆమె క్యారెక్టర్ చూసిన వారు .. ఇదేమంత రోల్ అంటూ పెదవి విరుస్తున్నారు.
యాత్ర సినిమాలో అనసూయ... రామిరెడ్డి కూతురు క్యారక్టర్‌లో నటించింది. సినిమాలోని తొలిభాగంలోనే అంటే సన్నివేశంలోనే అనసూయ కనిపిస్తుంది. వైఎస్సార్ పాత్రధారి మమ్ముట్టి, అనసూయకి నామినేషన్ వేయించి... గెలిపించడానికి అభయం ఇవ్వడం... పక్కనే ఉండి నామినేషన్ వేయించడం... గడపదొక్కి సాయమడిగిన ఆడకూతురితో రాజకీయాలేంది అని మమ్ముట్టి చెప్పే డైలాగ్స్ దగ్గర అనసూయ బాగా నటించింది. కానీ ఆ పాత్రకు మరికొంత స్కోప్ దక్కితే అనసూయకి ప్లస్ అయ్యేది. కానీ ఆ క్యారెక్టర్ కి యాత్రలో అంతకన్నా ఎక్కువ స్కోప్ ఇవ్వలేమని దర్శకుడు మహి చేతులెత్తేశాడు. మరి వెండితెర మీద వెలిగిపోదామనుకున్న అనసూయ ఇలాంటి చిన్న చితక క్యారెక్టర్స్ తోనే అడ్జెస్ట్ కావాల్సి వస్తుంది.