Advertisement

‘ఎన్టీఆర్’లో లేనిది.. ‘యాత్ర’లో ఉంది ఇదే


ప్రస్తుతం జనవరి, ఫిబ్రవరి రెండు నెలల్లో రెండు మహానాయకుల బయోపిక్‌లు వెండితెర మీద సందడి చేశాయి. మొదటగా ప్రేక్షకులముందుకు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు బయోపిక్ ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి తొమ్మిదిన వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 70 కోట్ల థియేట్రికల్ బిజినెస్‌తో భారీ అంచనాల నడుమ కథానాయకుడు విడుదలైతే.... సినిమాకి అదరగొట్టే పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఇంకేంటి ఎన్టీఆర్ కథానాయకుడు రికార్డులు తిరగరాయడం ఖాయమన్నారు. కానీ చివరికి ఎన్టీఆర్ బయ్యర్లు కోట్లలో నష్టాలూ చవి చూసారు. కారణం ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడితో ఎన్టీఆర్ నట జీవితాన్ని ఎటువంటి సమస్యలు లేకుండా చాలా క్లీన్‌గా దర్శకుడు క్రిష్ తెరకెక్కించాడు. అందులో ఎమోషన్ లేకపోవడం సినిమా కలెక్షన్స్ తగ్గిపోవడానికి బలమైన కారణం. చాలా సీన్స్ మనసుకు హత్తుకునేలా ఉన్నప్పటికీ.. బలమైన ఎమోషన్ మిస్ కావడంతో కథానాయకుడుకి భారీ దెబ్బ పడింది.

Advertisement

తాజాగా ఈ ఫిబ్రవరిలో మరో మహానాయకుడు తెలుగు ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర రూపంలో శుక్రవారం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. వరల్డ్ వైడ్‌గా 14 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసుకున్న యాత్ర సినిమా భారీ అంచనాల నడుమ అయితే విడుదల కాలేదు కానీ.. మంచి అంచనాల మధ్య విడుదలైంది. విడుదలైన మొదటి షోకే యాత్రకి పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి పాత్రధారి మమ్ముట్టి నటన యాత్ర సినిమాకే హైలెట్ అనేలా ఉందని.. అలాగే సినిమాలో ప్రజల మనసులు కదిలించే ఎమోషన్ బాగా పండడంతోనే యాత్రకి పాజిటివ్ టాక్ వచ్చిందని అంటున్నారు.

రాజశేఖర్ రెడ్డి జీవితంలో ఒక పార్ట్ అంటే కేవలం ఆయన పాద యాత్ర చేసిన పార్ట్‌ని మాత్రమే దర్శకుడు మహి బలమైన కథగా మలిచి సినిమాగా చేసాడు. మమ్ముట్టి నటన, సినిమాటోగ్రఫీ, బలమైన ఎమోషన్స్ అన్ని కలిపి సినిమాని విజయ తీరానికి చేర్చాయంటున్నారు. ఇక ఎన్టీఆర్ కథానాయకుడిలో మిస్ అయిన ఎమోషన్.. యాత్రలో పుష్కలంగా కనబడుతుందని.. రెండు సినిమాలను వీక్షించిన ప్రేక్షకులు చెబుతున్న మాట.

Missed in NTR.. Plus to Yatra:

Yatra Movie Talk at Box Office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement