Advertisement
Google Ads BL

శిష్యుడ్ని నమ్ముకుంటున్న పూరి..!!


కొందరు దర్శకులను చూసుకుంటే ఎందరో హీరోలకు, నటీనటులకు బ్రేక్‌ ఇచ్చి, స్టార్స్‌గా నిలబెట్టిన వారు తమ వారసుల విషయానికి వచ్చే సరికి చేతులెత్తేస్తారు. దాసరి కుమారుడు అరుణ్‌కుమార్‌, కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్‌, రవిరాజా పినిశెట్టి కొడుకు ఆది పినిశెట్టి నుంచి ఈవీవీ సత్యనారాయణ సైతం తన కుమారులైన ఆర్యన్‌రాజేష్‌, అల్లరినరేష్‌లకి తన దర్శకత్వంలో పెద్ద హిట్స్‌ ఇవ్వలేదు. ఇదే కోవలోకి వచ్చే దర్శకునిగా పూరీ జగన్నాథ్‌ని చెప్పుకోవాలి. తన సోదరుడు సాయిరాం శంకర్‌ని ‘143’ ద్వారా హీరోగా పరిచయం చేసినా హిట్‌ కొట్టలేకపోయాడు. ఆ తర్వాత తన శిష్యులతో పాటు తనకు మిత్రులైన కృష్ణవంశీతో పాటు పలువురు దర్శకుల చేతిలో పెట్టినా సాయిరాం కెరీర్‌ గాడిలో పడలేదు. 

Advertisement
CJ Advs

కాగా ఇప్పుడు పూరీ తనయుడు ఆకాష్‌పూరి పరిస్థితి కూడా అలానే ఉంది. పలు చిత్రాలలో బాలనటునిగా నటించి మెప్పించిన ఆకాష్‌ని ‘ఆంధ్రాపోరి’తో హీరోగా తెరంగేట్రం చేయించాడు. కానీ ఆ చిత్రం ఆడలేదు. దాంతో స్వయంగా తానే రంగంలోకి దిగి భారీ బడ్జెట్‌తో, ఇండో - పాక్‌ లవ్‌స్టోరీ నేపధ్యంలో అత్యంత బరువైన చిత్రం ద్వారా ఆకాష్‌ పూరీని రీలాంచ్‌ చేశాడు. కానీ ఫలితం మాత్రం శూన్యం. ఇక ఆకాష్‌తో మరో చిత్రం చేయనున్నానని పూరీ ప్రకటించాడు. కానీ ఎందుకనో ఆయన ప్రస్తుతం రామ్‌తో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రం తీస్తున్నాడు. నిధి అగర్వాల్‌-నభా పటేల్‌లు హీరయిన్లుగా నటిస్తున్నారు. ఇక పూరీ ఈసారి తన సోదరుడు సాయిరాం శంకర్‌లానే తనయుడు ఆకాష్‌ పూరీని సైతం తన శిష్యుడైన అనిల్‌ పడూరి చేతిలో పెట్టాడు. 

ఆకాష్‌ పూరీ విషయానికి వస్తే ఆయన మొదటి రెండు చిత్రాలు ఫ్లాప్‌లే అయినా ఆ కుర్రాడిలో టాలెంట్‌ బాగానే ఉందని తేలింది. మరి గురువు తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆయన తనయుడు ఆకాష్‌ పూరీకి మొదటి హిట్‌ని ఇచ్చి గురుదక్షిణ ఇస్తాడో లేదో చూడాలి. కాగా తాజాగా ఆకాష్‌పూరీ ఫొటో షూట్‌కి సంబంధించిన ఫొటోలు బాగా ఆకట్టుకుంటున్నాయి. మొన్న నిన్నటి వరకు మిల్క్‌బోయ్‌గా, లవర్‌బోయ్‌లా కనిపించిన ఆకాష్‌ తాజా ఫొటో షూట్‌లో కాస్త రఫ్‌లుక్‌లో ఉన్నాడు. సో.. ఆకాష్‌ని, అనిల్‌ తన గురువులాగా హీరోలను, టిపికల్‌ హీరోయిజం, కేర్‌లెస్‌, మాస్‌ యాటిడ్యూడ్‌ ఉన్న పాత్రలో చూపించనున్నాడనే విషయం అర్ధమవుతోంది. 

Akash Puri Movie in Puri Jagan Student Direction:

Akash Puri Next Film Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs