Advertisement
Google Ads BL

చంద్రబాబు చేతుల్లో.. ‘మహానాయకుడు’


ఎన్టీఆర్ కథానాయకుడుకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ రిజల్ట్ మాత్రం తేడాగా వచ్చింది. భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయిన ఈసినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లను మాత్రం రాబట్టలేకపోయింది. ఈ ఎఫెక్ట్ ‘మహానాయకుడు’ పై పడనుంది. అందుకే ఈసినిమా విషయంలో ప్రత్యేకమైన కేర్ తీసుకుంటున్నారు. 

Advertisement
CJ Advs

స్టోరీ లో ఎక్కడా లాగ్ లేకుండా.. ఇంట్రెస్టింగ్ ఎలెమెంట్స్ జోడిస్తూ మొత్తానికి ‘మహానాయకుడు’కి బాగానే తీర్చి దిద్దుతున్నారు. మహానాయకుడులో ఎన్టీఆర్ పాత్ర తరువాత అంత ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర చంద్రబాబు నాయుడుదే. ఈమూవీలో చంద్రబాబుని రెండు మూడు సీన్స్ హైలైట్ చేయనున్నారు అని తెలుస్తుంది.

అందుకే ‘మహానాయకుడు’ రఫ్ ఎడిటింగ్ అయిపోగానే చిత్రబృందం చంద్రబాబుకు ప్రత్యేకంగా షో వేసి చూపించనున్నారు. ఇకపోతే ఫిబ్రవరిలో రిలీజ్ అవ్వాల్సిన ఈసినిమా మార్చి 1 న రిలీజ్ అవుతుంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.  ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్, విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Chandra Babu to Watch Mahanayakudu Rough Cut:

Mahanayakudu: Babu To Take Final Call  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs