Advertisement
Google Ads BL

ఈ మెగాహీరోకి కూడా ‘గబ్బర్‌సింగ్’ ఇస్తాడా?


పవన్ కళ్యాణ్ కెరీర్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు దర్శకుడు హరీష్ శంకర్ బాలీవుడ్ దబాంగ్ సినిమాని తెలుగులో గబ్బర్ సినిమాగా రీమేక్ చేశాడు. బాలీవుడ్ మూవీని యాజిటీజ్ గా దింపెయ్యకుండా హరీష్, గబ్బర్ సింగ్ స్క్రిప్ట్ ని రాసుకున్నాడు. కొంత కామెడీ టచ్ ఇచ్చి గబ్బర్ సింగ్ ని పవన్ కళ్యాణ్ తో చేశాడు. పవన్ కళ్యాణ్ ఆ సినిమాతో మళ్ళీ కుదురుకున్నాడు. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత హరీష్ శంకర్ మాత్రం గబ్బర్ సింగ్ అంతటి విజయాన్ని అందుకోలేకపోయాడు కానీ.. పవన్ కళ్యాణ్ మాత్రం నెంబర్ వన్ హీరో అయ్యాడు.

Advertisement
CJ Advs

తాజాగా హరీష్ శంకర్ తమిళ జిగర్తాండ సినిమాని తెలుగులో మెగా హీరో వరుణ్ తేజ్ ని పెట్టి వాల్మీకి సినిమాగా రీమేక్ చేస్తున్నాడు. ఈమధ్యనే మొదలైన ఈ సినిమాని హరీష్ శంకర్ తనదైన శైలిలో జిగర్తాండలో మార్పులు చేర్పులు చేశాడట. వరుణ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ కి సూట్ అయ్యే విధంగా వాల్మీకి స్క్రిప్ట్ ని మార్చేశాడట. వరుణ్ తేజ్ కి వాల్మీకి సినిమాతో సూపర్ హిట్ పడడం ఖాయమని.. పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ తో ఎంత పేరొచ్చిందో... వరుణ్ తేజ్ కి వాల్మీకితో అంత మంచి హిట్ పడడం ఖాయమంటున్నారు.

మరి వాల్మీకిలో వరుణ్  తేజ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. హరీష్ ఈ విలన్ పాత్రని బలంగా రాసి.. దానికి కూడా కామెడీని జొప్పించాడేమో.. అందుకే వాల్మీకి పక్కా హిట్ అంటున్నారు. ఇక వరుణ్ తేజ్ ని హైలెట్ చేస్తూ వాల్మీకి ఉంటుందని.. అందుకే హీరోగా చిన్నపాటి పేరున్న శ్రీ విష్ణుని తీసుకున్నారనే టాక్ ఉంది. ఇక శ్రీ విష్ణుకి ఓ అన్నంత అందగత్తె.. హీరోయిన్ ని తీసుకురాకుండా మెయిన్ గా వరుణ్ తేజ్ హైలెట్ అయ్యేలా ఈ శ్రీ విష్ణుకి హీరోయిన్ ఉండబోతుందట. మరి శ్రీ విష్ణుకి హీరయిన్ గా తెలుగమ్మాయి ఈషా రెబ్బ పేరు కాస్త గట్టిగానే వినబడుతుంది.

Varun Tej Valmiki To Be High On Entertainment:

Gabbar Singh For PK, Valmiki For Varun  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs