Advertisement
Google Ads BL

దెబ్బకు బోయపాటిని బ్యాన్ చేసేశారు


మాస్ డైరెక్టర్ బోయపాటి పరిస్థితి ఇప్పుడు మరీ దారుణంగా తయారైంది. రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా చేసేసి విడుదల చేశాడో అప్పటినుండి బోయపాటికి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్లు కనబడుతుంది. మెగా ఫ్యామిలీ హీరోలైన అల్లు అర్జున్ తో సరైనోడు సినిమా చేసి హిట్ కొట్టిన బోయపాటి.. రామ్ చరణ్ తో వినయ విధేయ రామని తెరకెక్కించాడు. ఆ సినిమా భారీ డిజాస్టరయ్యింది. దానితో బోయపాటి బయట ఫోకస్ అవకుండా తిరుగుతున్నాడు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ వలన బోయపాటి మీడియాలో నానుతున్నాడు. వినయ విధేయ రామ పోవడానికి బోయపాటే కారణమన్నట్టుగా ఒక ప్రెస్ నోట్ ని రామ్ చరణ్ మీడియా మీదకి వదిలాడు.

Advertisement
CJ Advs

ఇప్పుడా ప్రెస్ నోట్ వలనే కాదు... వినయ విధేయ రామ డిస్ట్రిబ్యూటర్స్ కి ఎంతోకొంత వెనక్కి ఇవ్వాలనే నిర్ణయంలో బోయపాటి ససేమిరా అనడం.. చరణ్, నిర్మాత దానయ్యలు బోయపాటి మీద ఒత్తిడి తెస్తున్నారంటూ గత రెండు రోజులుగా మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్. మరోపక్క అసలు వినయ విధేయ రామ సినిమాకి అంత పెద్ద మొత్తం ఖర్చు పెట్టించడం బోయపాటి తప్పంటున్నారు. రామ్ చరణ్ చెప్పినా బోయపాటి పట్టించుకోలేదని... సినిమా ఫైనల్ కట్ చూశాక కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు ఎక్కువని చరణ్, నిర్మాత చెప్పినా... బోయపాటి పెడ చెవిన పెట్టడంతోనే.. ప్రేక్షకుల నుండి వినయ విధేయ రామ విషయంలో ఎదురు దెబ్బ తినాల్సి వచ్చిందని అంటున్నారు.

ఇక ఇదంతా ఇలా ఉండగా.. మెగా ఫ్యామిలీ బోయపాటిని బ్యాన్ చేసిందంటూ మరో న్యూస్ బయలు దేరింది. బోయపాటితో సినిమాలు చెయ్యడానికి మెగా హీరోలెవరు ముందుకు రారని ఆ న్యూస్ సారాంశం. మరి గతంలో అల్లు అర్జున్ తో బోయపాటి సినిమా అన్నారు, అలాగే చిరుతో కూడా బోయపాటి సినిమా ఉంటుందన్న న్యూస్ నడిచింది. మరి ఇప్పుడు బోయపాటిని మెగా హీరోలు బ్యాన్ చేస్తే చిరు, అల్లు అర్జున్ సినిమాలు కూడా బోయపాటికి ఉండవు. అలాగే ఇండస్ట్రీలో ఎక్కువమంది హీరోలున్నది కూడా మెగా ఫ్యామిలీలోనే...మరి బోయపాటికి మెగా ఫ్యామిలీ హీరోస్ సినిమాలివ్వకపోతే.. కష్టమే సుమీ..!

Mega Family To Ban Boyapati Srinu:

Mega Ban On Boyapati Srinu!!!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs