Advertisement
Google Ads BL

నితిన్ కూడా ఆ హీరోల లిస్ట్ లోకి..


వరస ప్లాప్స్ వెంటాడితే... ఆటోమాటిక్‌గా ఆ హీరోకి మార్కెట్ పడిపోతుంది. ఇక ఆ హీరో నిర్మాతలు చెప్పినట్టు చేయాలి. లేదంటే పారితోషకం తగ్గించుకోవాలి. అసలు ఇండస్ట్రీలో కొన్నాళ్ళు నిలబడాలంటే అలా తప్పక చెయ్యాలి. ఆ హీరో ఎంత పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్నవాడు అయినా సరే.. అణిగిమణిగి ఉండాలి. అంటే నోటికి లోకువ అన్నట్టుగా ఉండాలి. ఇక ఇప్పుడు అలాంటి కొంతమంది హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. ఈ లిస్ట్‌లో మొదటగా ఆరు ప్లాప్స్‌తో ఉన్న సాయి ధరమ్ తేజ్ ఉన్నాడు. సాయి నటిస్తున్న చిత్రలహరి సినిమాకి నిన్నగాక మొన్న ఆ సినిమా నిర్మాతలైన మైత్రి మూవీస్ వారు బడ్జెట్‌లో కోత విధించారు.

Advertisement
CJ Advs

ఇక నిన్న హీరో రామ్ కూడా తన పారితోషకాన్ని సగానికి సగం తగ్గించుకున్నాడనే వార్త వినబడింది. వరస ప్లాప్స్‌తో ఉన్న రామ్ వరస డిజాస్టర్స్‌తో ఉన్న పూరితో కలిసి సినిమా చేస్తున్నాడంటేనే రామ్ మార్కెట్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. పారితోషకం గురించి కూడా ఆలోచించకుండా పూరి సినిమా చేస్తున్నాడు రామ్. తాజాగా మరో హీరో కూడా ఇలాటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. చిన్న వయసులోనే హీరో అయ్యి... మధ్యలో పదేళ్లు హిట్ అనే పదానికి మొహం వాచి.. మళ్ళీ పదేళ్లకు సక్సెస్ ట్రాక్ ఎక్కి వరస హిట్స్ కొట్టాడు. కానీ కాలం కాటేసి మళ్ళీ వరస ప్లాప్స్ ఎదుర్కుంటున్న నితిన్ కూడా ఇప్పుడు తేజు, రామ్ పరిస్థితుల్లోనే ఉన్నాడు.

మూడు సినిమాల డిజాస్టర్స్ తో ఉన్న నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌కి భీష్మ అనే సినిమా చెయ్యాల్సి ఉంది. తాజాగా ఆ సినిమా ఆగిపోయిందనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. అసలు నితిన్ - వెంకీ కుడుముల ‘భీష్మ’ సినిమా ఆగిపోవడానికి కారణం నితిన్ పారితోషకంలో వచ్చిన విభేదాలే అంటున్నారు. లై సినిమాకి ముందు మంచి క్రేజ్ ఉన్నపుడు సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కమిట్ అయిన నితిన్.. లై, చల్ మోహన రంగ, శ్రీ‌నివాస క‌ల్యాణం తర్వాత వాళ్లకి డేట్స్ ఇచ్చాడు. 

అయితే ఈ మూడు సినిమాలు డిజాస్టర్ అవడంతో.. నితిన్ మార్కెట్ డౌన్ అయ్యింది. లై కి ముందు క్రేజ్ ఉన్న నితిన్ కి ఇప్పుడు పెద్దగా క్రేజ్ కనబడడం లేదు. అందుకే సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ వాళ్ళు నితిన్ పారితోషకం విషయంలో కాస్త వెనకడుగు వేస్తున్నారట. ఇక నితిన్ మాత్రం ససేమిరా అంటున్నాడట. తనకి క్రేజ్ ఉన్నప్పుడు ఎంత వచ్చేదో అంత ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నాడట. కానీ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కూడా తగ్గడం లేదట. అందుకే నితిన్ - వెంకీ భీష్మ అలా హోల్డ్ ఉన్న ప్రాజెక్ట్ గా సోషల్ మీడియాలో హైలెట్ అవుతోంది.

Nithiin in Flop Heroes List:

Nithiin and Venky Kudumula Bheeshma Shelved 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs