Advertisement
Google Ads BL

‘యాత్ర’ టాక్: వైసీపీ ఎలక్షన్ యాడ్


మహి వి రాఘవ్ దర్శకత్వంలో రాజకీయ నాయకుడు వైఎస్సార్ బయోపిక్ యాత్ర నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే  మొదటి షో పూర్తి చేసుకున్న యాత్ర సినిమాలో మలయాళ నటుడు మమ్ముట్టి అచ్చం రాజశేఖరుడిలా అదరగొట్టశాడంటున్నారు ప్రేక్షకులు. మమ్ముట్టి నటన యాత్ర సినిమాకే హైలెట్ అట. వైఎస్సార్ పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి ప్రజలతో ఎలా మమేకమయ్యాడో... ప్రజలతో తన అనుబంధాన్ని ఎలా ఏర్పరుచుకున్నాడో.. అనే విషయాన్ని దర్శకుడు మహి చాలా ఎమోషనల్ గా చూపించాడంటున్నారు. 

Advertisement
CJ Advs

ఇంకా సినిమాలో కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన రాజశేఖర్ రెడ్డి... కాంగ్రెస్ పార్టీలో ఎదురులేని నాయకుడిగా ఎలా ఎదిగాడో చూపించిన దర్శకుడు.. ప్రస్తుతం ఎలక్షన్స్ దగ్గర పడుతోంది గనక వైసీపీ పార్టీకి అనుకూలమైన  పొలిటికల్ సీన్స్ తో సినిమాని నింపేశాడని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలోని లోపాలను రాజశేఖర్ రెడ్డి ఎత్తి చూపించే సీన్స్.... అలాగే రాజశేఖర్ రెడ్డి పార్టీలో ఎదిగిన తీరును చూపించారంటున్నారు. మరి కాంగ్రెస్ కండువాతోనే రాజశేఖర్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రమంతా తిరిగి పాద యాత్ర చేశాడు. అలాగే కాంగ్రెస్ కండువాతోనే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా చక్రం తిప్పాడు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోని లోపాలను చూపించడం అనేది వైసీపీ పార్టీకి అనుకూలంగా కనబడుతుంది.

అందుకే యాత్ర సినిమా చూసిన వారంతా యాత్ర సినిమా మొత్తం వైసీపీ పార్టీకి 2019 ఎలక్షన్స్ యాడ్ అలా ఉందంటూ పెదవి విరుస్తున్నారు.  వైసీపీ పార్టీకి రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర యాత్ర ద్వారా ఎలక్షన్ యాడ్ ఇప్పించారంటున్నారు. మరి నిన్నటివరకు దర్శకుడు మహి ఇది రాజకీయ పార్టీ కోసం సినిమా కాదని.. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నాడు. కానీ తీరా ఇప్పుడు సినిమా వైసీపీ వాళ్ళ కోసం తీసినట్టుగా ఉంది.

Yatra Movie First Talk:

Yatra.. YSRCP Election Ad
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs