Advertisement
Google Ads BL

సీనియర్ దర్శకుడికి దారుణమైన అవమానం..!


సీనియర్ దర్శకుడికి దారుణమైన అవమానం..!

Advertisement
CJ Advs

బాల అనే దర్శకుడు తెలియని వారుండరు. "శివపుత్రుడు" లాంటి సినిమాతో సౌత్ సినిమా స్థాయిని పెంచిన స్టార్ డైరెక్టర్ అయిన బాలకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయినా.. ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం ఎప్పుడూ విఫలమవ్వలేదు. కానీ.. ఆయన కెరీర్ లో మొట్టమొదటిసారి ఆయన దర్శకుడిగా దారుణంగా ఫెయిల్ అవ్వడమే కాదు ఘోరమైన అవమానాన్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అదేంటంటే.. తెలుగులో క్లాసిక్ హిట్ గా నిలిచిన అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ను బాల చేతిలో పెట్టాడు విక్రమ్. తనకు నటుడిగా నేషనల్ అవార్డ్ వచ్చేలా చేసిన దర్శకుడైతే.. తన కుమారుడిని సరిగ్గా ప్రెజంట్ చేస్తాడని నమ్మిన విక్రమ్.. ధృవ్ విక్రమ్ ను బాల చేతిలో పెట్టాడు. 

కానీ.. సినిమా ఫస్ట్ లుక్ కానీ టీజర్ కానీ ఆకట్టుకొనే విధంగా రాలేదు. ప్రేక్షకులకు మాత్రమే కాదు సినిమాను రూపొందించిన నిర్మాతలకు కూడా సినిమా అవుట్ పుట్ నచ్చలేదట. దాంతో సినిమా విడుదలను ఆపేస్తున్నామని, సినిమా మొత్తం ఒక కొత్త దర్శకుడితో రీషూట్ చేసి అప్పుడు విడుదల చేస్తామని పత్రికా ప్రకటన ఇచ్చారు. ఈ విషయం నిన్నట్నుంచి వైరల్ అవ్వడంతో.. బాల సినిమాను అంత బ్యాడ్ గా తీశాడా అని అందరూ వాపోతున్నారు. సినిమా రేలీజయ్యాక బాగుందా లేదా అనే డెసిషన్ ను ప్రేక్షకులు తీసుకొంటే బాగుంటుంది కానీ.. ఇలా నిర్మాతలు సినిమా చాలా చండాలంగా వచ్చిందని చెప్పడం మాత్రం ఒక దర్శకుడిగా బాల కెరీడిబిలిటీని దెబ్బతీయడమే అవుతుంది. మరి ఈ డ్యామేజ్ నుంచి బాల తనను తాను ఎలా బయటకు పడేసుకుంటాడో చూడాలి. 

Huge Defamation for Star Director Bala:

Producers didnt liked bala version of arjun reddy, they scrapped it and planning to make it again with another director
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs