Advertisement
Google Ads BL

దిల్ రాజు భయపడ్డాడా..?


2019లో ఎఫ్2 తో భారీ హిట్ అందుకున్న దిల్ రాజు ఆ సక్సెస్ ను ఇంకా ఎంజాయ్ చేస్తూనే.. తన తదుపరి చిత్రాలను రెడీ చేస్తున్నాడు. అంతా బాగానే జరుగుతున్నప్పటికీ.. తన బ్యానర్ నుంచి రానున్న తదుపరి చిత్రమైన మహర్షి విషయంలో మాత్రం దిల్ రాజు కాస్త భయపడుతున్నాడని తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదలకావాల్సి ఉండగా.. ఏప్రిల్ 25కి రీసెంట్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికీ కొన్ని సాంగ్స్ మరియు షూటింగ్ పెండింగ్ ఉందట. కానీ.. అలా టైమ్ ఇస్తూ వెళ్తే వంశీ పైడిపల్లి విడుదల తేదీని మరోమారు వాయిదా వేసే అవకాశం ఉందని గ్రహించిన దిల్ రాజు సడన్ గా నిన్న ఉదయం డబ్బింగ్ వర్క్ మొదలుపెట్టించాడు. 

Advertisement
CJ Advs

ఈ విషయమై వంశీతో చిన్నపాటు డిస్కషన్ కూడా జరిగిందట. కానీ.. ఇలా ప్రెజర్ పెట్టకుంటే వంశీ పైడిపల్లి ఇంకా రీషూట్స్ అంటూ సినిమాను లేట్ చేయడమే కాదు.. బడ్జెట్ ను కూడా ఇంకా పెంచుకుంటూ వెళ్లిపోతాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఆల్రెడీ అనుకున్న బడ్జెట్ కంటే ఒక 30 కోట్లు దాకా ఎక్కువే అయ్యింది. మహేష్ బాబు మార్కెట్ మీద నమ్మకం ఉండడంతో ఆ విషయాన్ని నిర్మాతలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. వంశీకి అలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వదిలేయడం కూడా కరెక్ట్ కాదని దిల్ రాజు రంగంలోకి దిగాడు. ఇప్పుడు దిల్ రాజు ఫోర్స్ తో వంశీ సినిమాను త్వరగా పూర్తి చేయడమే కాదు.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగవంతం చేశాడు. నిన్న మొదలైన డబ్బింగ్ పార్ట్ తోపాటు ఎడిటింగ్ కూడా దాదాపుగా మొదలైనట్లే.

Dil Raju Afraid of Vamsi Paidipally:

Afraid of Vamsi Movie Making style and prolonged reshoots, Dil raju started the post production ahead 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs