Advertisement
Google Ads BL

వెంకీ మామా నువ్ నిజంగానే సూపర్..!


మనిషి కంటే కులానికి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇస్తూ సాధారణ జనాలే పేట్రేగిపోతున్న తరుణంలో.. సొంత స్టూడియో ఉన్న అతి తక్కువ హీరోల్లో ఒకడు అయ్యుండి, తెలుగు చిత్రసీమలోని అగ్ర కథానాయకుల్లో ఒకడైన వెంకటేష్ మాత్రం కులం కంటే గుణం ముఖ్యమని సమాజానికి చాటి చెప్పి ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. అదేదో కులరహిత సమాజం నేపధ్యంలో సినిమాను రూపొందించో, నటించో కాదు తన కుమార్తె ప్రేమ వివాహానికి అంగీకరించి. వరుడు ఎవరనేది ఇంకా తెలియలేదు కానీ.. నిన్న హైద్రాబాద్ లోని ఓ స్టార్ హోటేల్ లో వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత ఎంగేజ్ మెంట్ దగ్గుబాటి, అక్కినేని కుటుంబ సభ్యులు మరియు వారికి అత్యంత ప్రీతిపాత్రమైన బంధువులు మాత్రమే హాజరైన ఈ వేడుకలో ఆశ్రిత తనకు కాబోయేవాడికి రింగు తొడిగింది. 

Advertisement
CJ Advs

మార్చి 1న అంగరంగ వైభవంగా ఈ వేడుక జరగనుందని తెలుస్తోంది. హైద్రాబాద్ కి చెందిన రేస్ క్లబ్ ఛైర్మన్ సురేందర్ రెడ్డి మానవడితో కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఆశ్రిత ఆ విషయాన్ని తండ్రి వెంకటేష్ తో పంచుకోగా.. ఆయన సుముఖంగా స్పందించడంతో వెంటనే ప్రేమ వ్యవహారం పెళ్లి దాకా వెళ్లగలిగింది. దాంతో ఇప్పుడు అందరూ వెంకటేష్ ను మెచ్చుకోవడం మొదలెట్టారు. అందుకే అంటారు వెంకీ మామ సూపర్ అని. 

Venkatesh Accepted his Daughter love :

Venkatesh accepted his daughter love story and also fixed the date for the grand intercaste wedding
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs