Advertisement
Google Ads BL

రానా సరే.. అనిల్‌ సుంకర ఎందుకొదిలేశాడు?


మొదట్లో మహేష్‌బాబు చలవతో అతి తక్కువ సమయంలోనే ఎంతో పేరు తెచ్చుకున్న నిర్మాతల్లో అనిల్‌సుంకర ఒకరు. ఈయన 14రీల్స్‌ బేనర్‌లో భాగస్వామిగానే కాదు.. తానొక్కడే కూడా చిత్రాలు నిర్మిస్తూ వస్తున్నాడు. కానీ వీటి ద్వారా ఆయనకు లాభాలు కాదు కదా...! భారీ నష్టాలు వచ్చాయి. ‘దూకుడు, లెజెండ్‌, కృష్ణగాడి వీరప్రేమగాథ’లు బాగా ఆడి లాభాలు తెచ్చాయి. ‘ఈడో రకం.. ఆడో రకం’ ఫర్వాలేదనిపించింది. కానీ ‘బిందాస్‌, నమో వేంకటేశ, అహనా పెళ్లంట, యాక్షన్‌3డి, 1(నేనొక్కడినే), జేమ్స్‌బాండ్‌, ఈడు గోల్డ్‌ ఎహే, రన్‌, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు, లై, కిరాక్‌పార్టీ’ వంటి చిత్రాలు బాగా దెబ్బతీశాయి. 

Advertisement
CJ Advs

కాగా ప్రస్తుతం ఆయన మరో రెండు మూడు చిత్రాలు నిర్మిస్తున్నాడు. కాగా ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ ఫేమ్‌ వంశీకృష్ణ నాటి గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు బయోపిక్‌కి స్క్రిప్ట్‌ని రెడీ చేసి అనిల్‌సుంకరకి వినిపించడం, ఆయన ఓకే అనడం జరిగిపోయాయని వార్తలు వచ్చాయి. స్టువర్ట్‌పురం రాబిన్‌హుడ్‌ వంటి టైగర్‌ నాగేశ్వరరావు జీవితంలో సినిమాకి కావాల్సినన్ని అంశాలు ఉన్నాయి. దాంతో మొదట్లో రానా, ఆ తర్వాత నాగచైతన్య కూడా ఇందులో నటించేందుకు ఆసక్తి చూపించారు. కానీ ఆ తర్వాత ఎందుకో గానీ వారు దూరంగా జరిగారు. 

తాజాగా ఈ ప్రాజెక్ట్‌ నుంచి నిర్మాత అనిల్‌సుంకర కూడా తప్పుకున్నాడని సమాచారం. దాంతో దర్శకుడు వంశీకృష్ణ ఈ స్టోరీని బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌కి వినిపించడం, మార్పులు చేర్పులు లేకుండా ఆయన అంగీకరించడం జరిగిపోయాయి. ఇక నిర్మాతగా కూడా అభిషేక్‌ అగర్వాల్‌ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చాడని తెలుస్తోంది. తన అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బేనర్‌లో దీనిని ఆయన నిర్మించనున్నాడు. 

మరోవైపు ప్రస్తుతం బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ తేజతో కలిసి ‘సీత’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. దీని తర్వాత ఆయన తమిళ ‘రాక్షసన్‌’ చిత్రం రీమేక్‌ని పట్టాలెక్కించనున్నాడు. ఆ వెంటనే ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రం దర్శకుడు అజయ్‌భూపతి దర్శకత్వంలో మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో మల్టీస్టారర్‌ చేయనున్నాడు. ఇందులో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ సరసన అక్కినేని కోడలు సమంత నటించే అవకాశం ఉంది. బెల్లంకొండ మొదటి చిత్రం ‘అల్లుడు శీను’లో కూడా సమంతే హీరోయిన్‌ కావడం విశేషం. ఇందులో సాయితో పాటు నటించే మరో యంగ్‌హీరో ఖరారు కావాల్సివుంది...! 

Anil Sunkara Dropped Prestigious Film:

Abhishek Agarwal Replaced Anil Sunkara
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs