Advertisement
Google Ads BL

చరణ్.. క్షమాపణల వెనుక ఎన్టీఆర్..?


ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య స్నేహపూర్వక వాతావరణం రాజ్యమేలుతుంది. వారు ఎప్పటినుండో మంచి ఫ్రెండ్ అయినప్పటికీ... సోషల్ మీడియా బాగా పాపులర్ అయ్యాక వారి మధ్యన స్నేహబంధం అందరికి బహిర్గతం అయ్యింది. ఇక వారింటికి ఒకరు వెళ్లడం.. చిన్న చిన్న పార్టీలు, ఫ్యామిలీస్ మొత్తం కలవడం ఎంజాయ్ చెయ్యడం ఇలా అంతా అద్భుతంగా సాగిపోతుంది. మరి ఇండస్ట్రీలో బాగా క్లోజ్ ఫ్రెండ్స్ గా మనకి రామ్ చరణ్ - మహేష్, రామ్ చరణ్ - ఎన్టీఆర్, రానా - రామ్ చరణ్ ఇలా చాలామందే కనబడుతున్నారు. ఇక ఎన్టీఆర్ - రామ్ చరణ్  ఫ్యామిలీస్ తరుచు కలుస్తున్నారు కూడా. రామ్ చరణ్ భార్య, ఎన్టీఆర్ భార్యలు కూడా క్లోజ్ గా మూవీ అవుతున్నారు. అయితే ఎంతగా స్నేహం ఉన్నప్పటికీ.. ఒకరి పర్సనల్ విషయాలు ఒకరు, అలాగే ఒకరి కెరీర్ గురించి మాట్లాడుకునే సీన్ అయితే ఉండదు. ఎందుకంటే స్టార్ హీరోలు ఒకే ఫీల్డ్ లో ఉండడం... ఎంతగా ఫ్రెండ్షిప్ చేసిన.... వారి మధ్య ఖచ్చితంగా పోటీ ఉంటుంది. అది ఏ ఫీల్డయినా సరే.

Advertisement
CJ Advs

మరి ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఒకే ఫీల్డ్ లో ఉన్నారు. వారు ఇద్దరు కలిసి భారీ మల్టీస్టారర్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు వీరిపై ఒక హాట్ న్యూస్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఎన్టీఆర్ చెప్పడం వలన రామ్ చరణ్ ఒక డేరింగ్ స్టెప్ వేశాడని. ఇంతకీ ఆ స్టెప్ ఏంటంటే... రామ్ చరణ్ తాజా చిత్రం వినయ విధేయ రామ సినిమా ఫలితంపై రామ్ చరణ్ ఒక లేఖను పోస్ట్ చేశాడు. ఆ లేఖలో బోయపాటి పేరు ప్రస్తావన లేకుండా అభిమానులకు, అందరికి క్షమాపణలు చెప్పి తన సినిమా డిజాస్టర్ అని ఒప్పేసుకున్నాడు. అయితే చరణ్, బోయపాటి పేరుని ప్రస్తావించకుండా చేసి బోయపాటిపై పగ తీర్చుకున్నాడని.... అది కూడా ఎన్టీఆర్ చెప్పడం వలనే అంటూ ఒక సిల్లీ న్యూస్ తెర మీదకి వచ్చింది.

ఎన్టీఆర్ కి బోయపాటితో దమ్ము అప్పటినుండి విభేదాలు ఉన్నాయని.. అలాగే బోయపాటికి, బాబాయ్ బాలయ్యకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. వినయ విధేయ రామ తర్వాత బోయపాటి బాలయ్య సినిమానే చెయ్యాలి.. గనక బోయపాటి మీద దెబ్బేస్తే.. క్రేజ్ తగ్గుతుందని.. ఎన్టీఆర్, రామ్ చరణ్ చేత ఇలాంటి నోట్ విడుదల చేయించాడంటున్నారు. మరి ఎన్టీఆర్ చెప్పేస్తే రామ్ చరణ్ చేసేస్తాడా.. ? వినడానికే సిల్లీగా లేదు. అయినా దానికి కూడా ఒక రీజన్ చెబుతున్నారు. బ్రుస్లీ, ఆరెంజ్ సినిమాలప్పుడు రామ్ చరణ్ ఇలా చెయ్యలేదంటున్నారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ప్రోద్బలం వలెనే చరణ్ ఇలా చేశాడంటూ సిల్లీగా ఆలోచిస్తున్నారు.

NTR Behind VVR Ram Charan Sorry:

Shocking Allegations on Ram Charan Sorry
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs