Advertisement
Google Ads BL

‘యాత్ర’పై ఎవ్వరూ ఫోకస్ పెట్టరే..?


మమ్ముట్టి హీరోగా మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన వైఎస్సార్ బయోపిక్ ‘యాత్ర’ సినిమా మరికొద్ది గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పొలిటికల్ లీడర్ వైఎస్సార్ జీవిత చరిత్రని మహి వి రాఘవ్ ఎలాంటి కాంట్రవర్సీలకు తావివ్వకుండా తెరకెక్కించాడు. వైఎస్సార్ పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి  అదరగొట్టేస్తున్నాడు. పంచెకట్టు, పాదయాత్ర అన్నింటిలో రాజశేఖర్ రెడ్డి స్టయిల్లోనే మమ్ముట్టి కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఒక కీలకపాత్రలో హాట్ యాంకర్ అనసూయ కూడా నటించింది. 

Advertisement
CJ Advs

అయితే ఈ సినిమాకి ప్రేక్షకులలో పెద్దగా ఆసక్తి మాత్రం కనిపించడం లేదు. భారీ బడ్జెట్, స్టార్ హీరోల సినిమాలు వచ్చేటప్పుడు ప్రేక్షకుల ఆసక్తి, అటెన్షన్ ఆ సినిమాల మీదే ఉంటుంది. ఆఖరుకి మంచి ట్రైలర్, టీజర్ తో ఆకట్టుకునే చిన్న సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నా ప్రేక్షకులు ఎంతో కొంత ఆసక్తి చూపుతారు.

మరి వరల్డ్‌వైడ్ గా పదమూడున్నర కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్న యాత్ర సినిమాపై అటు ట్రేడ్‌లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ పెద్దగా ఇంట్రెస్ట్ మాత్రం కనిపించడం లేదు. అలాగే యాత్ర‌కి ప్రమోషన్స్ అక్కర్లేదనుకున్నారేమో.. కేవలం డైరెక్టర్ మహి రాఘవ్ మాత్రం మీడియా ముందు కాస్త హడావిడి చేస్తున్నాడు. అలాగే లెజెండ్రీ పొలిటీషియన్స్ అంటూ ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి ఫొటోలతో లేఖలు విడుదల చేస్తున్నాడు. మహి ఎంతగా యాత్ర మీద అందరిలో ఆసక్తిరేపుదామన్నా... సినిమా మీద మాత్రం జనాల్లో పెద్దగా ఇంట్రెస్ట్ క్రియేట్ అవడం లేదు. 

ఇక యాత్ర బుకింగ్స్ కూడా చాలా నీరసంగా ఉన్నాయి. మరి యాత్రని కొన్న డిస్ట్రిబ్యూటర్స్‌కి పెట్టిన మొత్తం వస్తుందో రాదో అనే టాపిక్ ఇపుడు ఫిలింసర్కిల్స్‌లో వినబడుతుంది. మరోపక్క వైఎస్సార్‌సీపీ ఎమ్యెల్యేలు కానీ, కార్యకర్తలు కానీ యాత్ర సినిమా మీద ఫోకస్ పెట్టినట్లుగా కనబడటం లేదు. తమ దైవం బయోపిక్ రూపంలో థియేటర్లలోకి వస్తుంటే.. వైసీపీ వాళ్ళు ఇలా కామ్‌గా ఉంటే సినిమా మీద క్రేజ్ ఎలా వస్తుందో మరి.

No Craze on YSR Biopic Yatra:

No promotions to Yatra Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs