సాయికి బడ్జెట్లో.. రామ్కు రెమ్యూనరేషన్లో
Puri Jagannadh and Ram Movie Latest Update
Advertisement
CJ Advs
Ram Takes Sensational Decision for Puri :
ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలామంది యంగ్ హీరోస్ వరస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బంది పడుతున్నారు. వరస ప్లాప్స్‌తో వారి మార్కెట్ పూర్తిగా డౌన్ అయ్యింది. అయితే ఆయా హీరోల మార్కెట్ కి అనుకూలంగానే నిర్మాతలు కూడా బడ్జెట్ ని సెట్ చేస్తున్నారు. తాజాగా సాయి ధరమ్ - కిశోర్ తిరుమల ‘చిత్రలహరి’ విషయంలో మైత్రి మూవీస్ వారు బడ్జెట్ లో కోత విధించినట్లుగా గత రెండు రోజులనుండి ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అయితే తేజ్ మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకునే.. మైత్రి మూవీస్ వారు అలా చేశారని అంటున్నారు. మరోపక్క మరో హీరో పరిస్థితి కూడా ఇలానే ఉంది.
ఆ హీరో మరెవరో కాదు హీరో రామ్. హీరో రామ్ కూడా వరస వైఫల్యాలతో బాధపడుతున్నాడు. యావరేజ్ హిట్స్ కొడుతున్నాడు కానీ... హిట్ కొట్టలేకపోతున్నాడు. హిట్ అవుతాయన్న ‘ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే’ చిత్రాలు కూడా యావరేజ్ పడేసరికి రామ్ మార్కెట్ పడిపోయింది. దానికి తగ్గట్టుగా కొంతకాలంగా హిట్టు కొట్టలేక.. కెరీర్ అగమ్యగోచరంగా మారిన దర్శకుడు పూరి జగన్నాధ్ తో రామ్ కమిట్ అవడంతో.. వీరి కాంబో మీద భారీగా అయితే అంచనాలు లేవు. ఇక బయట నిర్మాతలెవరు రాకపోయేసరికి మళ్ళీ పూరీనే ఛార్మి‌తో కలిసి ఇస్మార్ట్ శంకర్‌ని నిర్మిస్తున్నాడు.
అయితే భారీ అంచనాలేమి లేని ఈ సినిమాకి బిజినెస్ కూడా భారీగా జరిగే అవకాశాలు లేకపోవడం.. అదంతా పూరి మెడకు చుట్టుకోకుండా ఇప్పుడు రామ్ కూడా ఈ సినిమాలో భాగస్వామి అవుతున్నాడనే టాక్ మొదలైంది. ఒక్కో సినిమాకి మూడు కోట్లు పారితోషికం తీసుకునే రామ్ ఇప్పుడు పూరి సినిమాకి మూడు కోట్లలో సగం మాత్రమే తీసుకుంటున్నాడట. అయితే కథ నచ్చి పూరితో సినిమా చేయాలనుకున్న రామ్.. పూరీని పిలిచి కథ బాగుంది, సినిమాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా నిర్మించమని చెప్పాడట. దీనికోసం తన పారితోషికం విషయం గురించి కూడా ఆలోచించవద్దని చెబుతూ.. తన పారితోషకాన్ని సగానికి తగ్గించుకున్నాడట రామ్. రామ్ నిర్ణయం బాగానే ఉంది కానీ.., అసలు ఎందుకు ఈ స్థితికి రావాల్సి వచ్చిందో.. ఒక్కసారి రామ్ ఆలోచించుకుంటే బెటరని రామ్‌కు కొందరు సలహాలు ఇస్తున్నారట.
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads