Advertisement
Google Ads BL

తేజూ సినిమాకి కోత మొదలైంది..!


మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇండస్ట్రీలోకి ఎంటరైన వెంటనే మంచి దర్శకుల చేతుల్లో పడ్డాడు. ఆ దర్శకులు బ్లాక్ బస్టర్ హిట్స్ సాయి ధరమ్ కి ఇవ్వకపోయినా.... యావరేజ్ హిట్స్ ఇచ్చారు. హీరోగానూ గుర్తింపు పొందాడు. కానీ గత కొంత కాలంగా సాయి ధరమ్ తేజ్ వరుస డిజాస్టర్స్ తో తెగ ఇబ్బంది పడుతున్నాడు. సుప్రీం తర్వాత సాయి ధరమ్ కి మళ్ళీ ఆ రేంజ్ హిట్ దక్కలేదు. వరుసగా ఆరు సినిమాలు డిజాస్టర్ అవడంతో తేజు మార్కెట్ ఘోరంగా పడిపోయింది. జవాన్, ఇంటిలిజెంట్, తేజ్ ఐ లవ్ యు ఇలా వరుసగా తేజ్ నటించిన చిత్రాలు ప్లాప్స్ కాదు.. డిజాస్టర్స్ అయ్యాయి. అలాగే నిర్మాతలకు భారీ లాస్ ని ఈ చిత్రాలు మిగిల్చాయి.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడా డిజాస్టర్స్ వలన తేజ్ మార్కెట్ అతలాకుతలం అయ్యింది. ఆ ఎఫెక్ట్ తేజ్ తదుపరి చిత్రం చిత్రలహరి మీద పడింది. ఎటువంటి హడావిడి అంచనాలు లేకుండా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఒకే ఒక ప్లస్ పాయింట్... నిర్మాతలు. వరుస విజయాలతో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్, తేజ్ - కిషోర్ తిరుమల చిత్రలహరిని తెరకెక్కిస్తున్నారు. మరి సక్సెస్ ఫుల్ గా మూవీస్ నిర్మిస్తున్న మైత్రి వారు తాజాగా తేజ్ సినిమా విషయంలో ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారనే టాక్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది.

తేజ్, కిషోర్ తిరుమల చిత్రానికి ముందుగా వారు 20 కోట్ల బడ్జెట్ అనుకుని సినిమాని మొదలుపెట్టగా.. సాయి ధరమ్ మార్కెట్ ఘోరంగా పడిపోవడంతో... ఇప్పుడా బడ్జెట్ లో కోత విధించినట్లుగా చెబుతున్నారు. అది ఏ కోటో తగ్గించలేదు.. ఏకంగా ఐదు కోట్లను బడ్జెట్ లో కోత పెట్టారట. అంటే ముందు 20  అనుకుంటే.. ఇప్పుడు 15  అన్నమాట. ఇక సినిమాకి థియేట్రికల్ హక్కులను కూడా రీజనబుల్ రేట్స్ అంటే సాయి ధరమ్ మార్కెట్ కి అనుకూలంగా అమ్మినా... శాటిలైట్, డిజిటల్ రైట్స్ తో లాభాలు రాబట్టాలన్న ఆలోచనలో మైత్రి వారు ఈ బడ్జెట్ కోత విధించినట్టుగా ఫిలింనగర్ టాక్.

Budget Decreased for Teju and Kishore Tirumala Film :

5 Crores Decreased in Sai Dharam Tej Chitralahari Budget
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs