Advertisement
Google Ads BL

దిల్ రాజు ఇంకా ఏం ఫిక్స్ అవ్వలేదట..!


2019లో బ్లాక్ బస్టర్ హిట్ తో సక్సెస్ ఫుల్ గా కొత్త సంవత్సరాన్ని ఆరంభించిన దిల్ రాజు, తన విజయానందాన్ని తన బృందంతో పంచుకొనే పనిలో భాగంగా వాళ్ళకి గిఫ్ట్ లు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సక్సెస్ కు కారణమైన ఎఫ్ 2 ప్రొడక్షన్ టీం ను ఇటీవల బ్యాంకాక్ కు తీసుకెళ్లిన దిల్ రాజు.. దీనంతటికి మూలకారకుడైన అనిల్ రావిపూడికి మాత్రం భారీ గిఫ్ట్ ఇవ్వనున్నాడని. బీయండబ్య్లూ కార్ లేదా పెద్ద బంగ్లా ఆఫర్ ఇచ్చాడని, అనిల్ రావిపూడి ఏది సెలక్ట్ చేసుకుంటే అది కొనిస్తాడని వార్తలు గత రెండ్రోజులుగా హల్ చల్ చేస్తున్నాయి. గతంలోనూ దిల్ రాజు ఇలా తనకు హిట్ ఇచ్చిన దర్శకులకు భారీ గిఫ్ట్ లు ఇచ్చి ఉండడంతో ఇది కూడా నిజమే అనుకున్నారు జనాలు. 

Advertisement
CJ Advs

ఇదే విషయాన్ని అనిల్ రావిపూడిని అడగగా.. ఆయన ఇప్పటివరకూ నన్ను అయితే ఏమీ అడగలేదు, ఒకవేళ ఆయన ఇస్తానంటే నేను తీసుకొను అంటానా చెప్పండి. మీలాగే ఆయన గిఫ్ట్ ఇస్తే బాగుండు అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను అని సమాధానమిచ్చాడు. అంటే దిల్ రాజు ఇలా గిఫ్ట్ ఇస్తున్నాడనే వార్తలో నిజం లేదు కానీ.. దిల్ రాజు గిఫ్ట్ స్టే తీసుకుందామనే ఆలోచన మాత్రం అనిల్ రావిపూడికి ఉన్నట్లు స్పష్టమైంది. 

మరి రాజుగారు ఈ విషయాన్ని గమనించి తన బ్యానర్ కు రెండు బ్లాక్ బస్టర్స్ ఇవ్వడమే కాక మరో బ్లాక్ బస్టర్ కి సన్నాహాలు చేసుకుంటున్న అనిల్ రావిపూడి కోరికను తీరుస్తాడో లేదో చూడాలి.

Dil Raju didnt planned anything for Anil Ravipudi Yet:

Buzz is that Dil Raju to Gift a Costly Villa or a BMW Car to Anil Ravipudi. But Anil Denied it
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs