Advertisement
Google Ads BL

ఆ వార్తల్లో నిజంగా నిజం లేదు: యాంగ్రీ స్టార్


టాలీవుడ్‌లో మొదటి నుంచి రాజశేఖర్‌, జీవిత దంపతులతో సి.కళ్యాణ్‌కి అవినాభావ సంబంధం ఉంది. కానీ ఆమధ్య రాజశేఖర్‌ దాదాపు ఫేడవుట్‌ అయిపోయి ఇక క్యారెక్టర్‌ రోల్స్‌కి, విలన్‌ పాత్రలకి ఫిక్స్‌ అయిన సమయంలో ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో పాత రాజశేఖర్‌లోని యాంగ్రీ యంగ్‌మేన్‌ని చూపిస్తూ వచ్చిన ‘పీఎస్వీ గరుడవేగ’ ఆయనకు కమ్‌బ్యాక్‌ మూవీగా నిలిచింది. బడ్జెట్‌ని రాజశేఖర్‌ స్థాయికి మించి పెట్టడం వల్ల కమర్షియల్‌గా సక్సెస్‌ కాలేదు గానీ అందరి ప్రశంసలను ఈ చిత్రం పొందింది. దాంతో ఎంతో ఉత్సాహంగా రాజశేఖర్‌ కాస్త గ్యాప్‌ ఇచ్చి ‘కల్కి’ చిత్రం చేస్తున్నాడు. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని సి.కల్యాణ్‌తో కలిసి రాజశేఖర్‌ నిర్మిస్తున్నాడు. 

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా రాజశేఖర్‌ మాట్లాడుతూ, తాను వరుస ఫ్లాప్‌లలో ఉన్నప్పుడు ఇక నటనకు గుడ్‌బై చెప్పమని, పిల్లలకు చాన్స్‌ ఇవ్వాలని సి.కళ్యాణ్‌ అన్నాడు. అలాంటి సి.కళ్యాణే ఇప్పుడు స్వయంగా నాతో చిత్రం తీయడానికి ముందుకు వచ్చారు అని చెప్పాడు. ఇక ఈ చిత్రం దర్శకత్వంలో తాము జోక్యం చేసుకోవడం నిజం కాదని, తాను మరీ అంత చెడ్డవాడిని కాదని రాజశేఖర్‌ చమత్కరించారు. 

ఇక తాజాగా ‘కల్కి’ టీజర్‌ విడుదల చేశాడు. ఇది సాధారణ టీజర్‌గా కాకుండా కేవలం రాజశేఖర్‌ బర్త్‌డే కానుకగా విడుదల చేసినట్లుగా అనిపిస్తుంది. సినిమాకి సంబంధించిన డీటెయిల్స్‌, కథ, కథనాలు, ఇతర పాత్రల జోలికి పోకుండా కేవలం రాజశేఖర్‌లోని యాక్షన్‌ కోణాన్ని చూపిస్తూ సాగింది. వానలో కొందరు దుండగులు రాజశేఖర్‌పై దాడి చేయడం, దానిని ఆయన గొడుగు సాయంతో ఎదుర్కొంటూ ఒడుపుగా తప్పించుకోవడం వంటి సీన్స్‌తో యాక్షన్‌ ప్రాధాన్యంగా కట్‌ చేశారు. 

ఇక ఈ మూవీలో రాజశేఖర్‌ సరసన ఆదాశర్మ-నందిత శ్వేత నటిస్తున్నారు. ఈ చిత్రంతో వయసులో ఉన్నప్పుడు రాజశేఖర్‌కి వచ్చిన బిరుదు యాంగ్రీ యంగ్‌మేన్‌ నుంచి యాంగ్రీ స్టార్‌గా మార్చారు. మరి ఈ చిత్రం ఆయనకు ఎలాంటి ఫలితం అందిస్తుందో వేచిచూడాల్సివుంది...! 

Rajasekhar Clarity about Kalki Movie Direction:

Rajasekhar Speech at Kalki Movie Teaser Launch 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs