Advertisement
Google Ads BL

షాక్: రామ్‌చరణ్ క్షమాపణలు చెప్తూ లెటర్!


రామ్‌చరణ్ తాజా చిత్రం వినయ విధేయ రామ విడుదలైన 20 రోజులకే చేతులెత్తేసింది. సినిమా విడుదలైన మొదటి షోకే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ రంగస్థలంలాంటి సినిమాలో నటించిన రామ్ చరణ్ క్రేజ్ తో బయ్యర్లకు భారీ నష్టాలను అయితే మిగల్చలేదు కానీ.... 30 కోట్లకు టెండర్ పడింది. అయితే సినిమా విడుదలైన 25 రోజుల వరకు ఆ సినిమా ప్లాప్ గురించి మాట్లాడే ధైర్యం చెయ్యలేదు వినయ విధేయ రామ టీం. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మెగా ఫ్యాన్స్ కే నచ్చలేదు. ఓవర్ యాక్షన్ ఉండడంతో సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ తిప్పికొట్టారు. అయితే సినిమా విడుదలయినప్పటి నుండి ఇప్పటివరకు ఒక్క మాట కూడా మాట్లాడని రామ్ చరణ్ సడన్ గా ఈరోజు (మంగళవారం) మీడియాకి ఒక ప్రెస్ నోట్ పంపాడు.

Advertisement
CJ Advs

తమ సినిమా అంచనాలు అందుకోలేకపోయినందుకు క్షమాపణలు చెబుతున్నాడు రామ్ చరణ్. వినయ విధేయ రామ సినిమాని, మమ్మల్ని ఆదరించిన అభిమానులకు కృతఙ్ఞతలు అని చెప్పిన చరణ్.. వినయ విధేయరామ కోసం కష్టపడిన సాంకేతిక నిపుణలకు, నటీనటులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ‘నిర్మాత దానయ్య సహకారం మరువలేనిది... మమ్మల్ని  నమ్మిన పంపిణి దారులకు, ప్రదర్శన దారులకు కృతజ్ఞుడినై ఉంటాను... మీ అందరికి నచ్చి, మిమ్మల్ని వినోదింప జేసే చిత్రాన్ని చెయ్యడానికి ఎంతో శ్రమించాము.. కానీ మీ అంచనాలను మా సినిమా అందుకోలేకపోయింది... భవిష్యత్తులో మీరు మెచ్చే నచ్చే చిత్రాలను చెయ్యడానికి శ్రమిస్తాను..’ అని ప్రెస్ నోట్ లో చరణ్ పేర్కొన్నాడు.

రామ్ చరణ్ ఇంకా తనకి ఎల్లప్పుడూ మద్దతుగా నిల్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపాడు. మరి రామ్ చరణ్ తన సినిమా ప్లాప్ పై... ఈ విధంగా స్పందించడం.. మెచ్చుకోదగిన విషయం. ఇలా బహిరంగంగా అభిమానులకు క్షమాపణలు చెప్పడం.. తమ సినిమా గురించి రామ్ చరణ్ అలా ఓపెన్ అవడం చూసిన వారు రామ్ చరణ్ ని పొగిడేస్తున్నారు.

Mega Power Star Ram Charan Says Sorry:

Ram Charan Released Letter for fans and Distributors 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs