Advertisement
Google Ads BL

మెగా హీరో కోసం సుక్కు గట్టిగా ప్లాన్ చేశాడు


మెగా హీరోలు పుట్టలు పుట్టలుగా ఇండస్ట్రీకి పరిచయం అవుతూనే ఉన్నారు. ఏడాదికో హీరో చొప్పున మెగా ఫ్యామిలీ నుండి హీరోలుగా వస్తున్నారు. నిన్నగాక మొన్న మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ వస్తే.. తాజాగా సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ వచ్చాడు. సుకుమార్ బ్యాక్ బోన్‌గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి సుకుమార్ సన్నిహితులు మైత్రి మూవీస్ వారు నిర్మాతలు. ఇక సుకుమార్ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కాస్త మాస్ టచ్‌లో రియలిస్టిక్‌గా వుండబోతుందట. మరి తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనస్సులో తనదైన ముద్ర వెయ్యడానికి వైష్ణవ్ తేజ్ రెడీ అవుతున్నాడన్నమాట.

Advertisement
CJ Advs

అయితే వైష్ణవ్ తేజ్ చెయ్యబోయే సినిమా ఆర్‌ఎక్స్ 100, అర్జున్ రెడ్డి మాదిరిగా కాస్త రఫ్‌గా ఉండేలా సుకుమార్ అండ్ టీం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక ఫిషర్ మ్యాన్ లవ్ స్టోరీగా ఈ సినిమా ఉండబోతుందని వైష్ణవ్ తేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటేనే తెలిసిపోతుంది. వైష్ణవ్ తేజ్ సినిమా మొత్తం కోస్తా బెల్ట్ నేఫథ్యంలో వుంటుందని తెలుస్తోంది. అయితే కాకినాడలో జరిగిన ఒక ప్రేమ కథ ఆధారంగా సుకుమార్ అసిస్టెంట్ ఈ సినిమా కథ ప్రిపేర్ చేసాడని చెబుతున్నారు. యువతకు బాగా కనెక్ట్ అయ్యే విధంగా కాస్త మాస్ టచ్ ని ఈ ప్రేమ కథకు ఇస్తున్నారని చెబుతున్నారు.

మరి మెగా హీరో వైష్ణవ్‌ని మాస్ హీరోని చేసేందుకు సుకుమార్ గట్టిగానే ప్లాన్ చేశాడంటున్నారు. ఇక రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్ మాత్రమే కాదు... ఆయన నేపథ్యంలో తెరకెక్కబోయే సినిమాల మీద కూడా భారీ అంచనాలే ఉంటాయి. మరి ఆ అంచనాలు, క్రేజ్ వైష్ణవ్ తేజ్ కి ఏ మేర పనికొస్తాయో చూద్దాం.

Sukku Excellent Planning for Mega Hero Entry:

Mega Hero Vaishnav Tej Entry with RX 100 and Arjun Reddy type story
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs