Advertisement
Google Ads BL

మహేష్, చరణ్.. సై అంటే సై అంటున్నారు


మన స్టార్‌ హీరోలు ఒక్కో సినిమాకి కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటూ ఉంటారు. ఇక ఇతర వ్యాపారాలపై కూడా దృష్టిని పెట్టి, ఎయిర్‌లైన్స్‌ నుంచి మల్టీప్లెక్‌, మాల్స్‌, రియల్‌ ఎస్టేట్‌ వంటి పలు బిజినెస్‌లలోకి ఎంటర్‌ అవుతున్నారు. ఇక విషయానికి వస్తే టాలీవుడ్‌ స్టార్స్‌లో ఇంతవరకు ఎక్కువ ఆస్తులు, సంపాదన ఉన్న వ్యక్తిగా సూపర్‌స్టార్‌ మహేష్‌బాబును చెప్పుకునేవారు. నిర్మాతగా ఎం.బి బేనర్‌లో సహనిర్మాతగా, దక్షిణాదిలోనే హయ్యెస్ట్‌ రెమ్యూనరేషన్‌, ఎక్కువ క్రేజ్‌ ఉన్న పలు మల్టీ కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా, యాడ్స్‌ ద్వారా అత్యధిక మొత్తం సంపాదిస్తున్న వ్యక్తిగా మహేష్‌బాబుని చెప్పుకోవాలి. 

Advertisement
CJ Advs

మరోవైపు ఆయన శ్రీమతి నమ్రతా శిరోద్కర్‌ వైపు నుంచి కేవలం వందల, వేల కోట్ల ఆస్తులు మహేష్‌కి వచ్చాయనే వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఈ విషయంలో ఇప్పుడు మహేష్‌తో, రామ్‌చరణ్‌ పోటీ పడుతున్నాడట. ఈయన స్టార్‌ హీరోగా భారీ రెమ్యూనరేషన్‌, రాజమౌళి ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో పారితోషికం బదులు లాభాలలో వాటా కొణిదెల ప్రొడక్షన్స్‌కి నిర్మాతగా, పలు వ్యాపారాలలో కూడా ఈయన సంపాదన రోజురోజుకీ పెరిగిపోతున్నదని సమాచారం. 

అయితే మహేష్‌కి సూపర్‌స్టార్‌ కృష్ణ నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి పెద్దగా లేదు. అందునా కృష్ణ ఆస్తికి మహేష్‌తోపాటు రమేష్‌బాబు కూడా వారసుడే. కానీ చరణ్‌ విషయానికి వస్తే ఆయన మెగాస్టార్‌ చిరంజీవికి ఏకైక వారసుడు. అలా చిరు సంపాదన మొత్తం చరణ్‌కే దక్కుతుంది. మరోవైపు ఉపాసనను వివాహం చేసుకున్న తర్వాత అపోలో గ్రూప్‌ నుంచి 1000కోట్ల వరకు ఆస్తిపాస్తులు చరణ్‌ సొంతం అయ్యాయని అంటున్నారు. 

తాజాగా చరణ్‌ హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో తన టేస్ట్‌కి అనుగుణంగా ఏకంగా 38కోట్ల ఖర్చుతో సొంత ఇంటిని నిర్మించుకోవడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌ అయింది. ఓ జాతీయ చానెల్‌ ప్రకారం చరణ్‌ ఆస్తుల విలువ ఏకంగా 1500 కోట్ల వరకు ఉండవచ్చని సమాచారం. మొత్తానికి సంపాదన విషయంలో మహేష్‌, చరణ్‌లు పోటీ పడుతున్నారనేది వాస్తవం. మిగిలిన వారు వారి దరిదాపుల్లో కూడా లేరనేది నిజం. 

Mahesh Babu vs Ram Charan :

Mahesh and Charan Richest Persons in Tollywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs