Advertisement
Google Ads BL

నిత్యామీన‌న్ తొలి బాలీవుడ్ మిష‌న్.. !


నిత్యామీన‌న్ తొలిసారి బాలీవుడ్ చిత్రంలో న‌టిస్తోంది. అక్ష‌య్‌కుమార్ హీరోగా న‌టిస్తున్నారు. `మిష‌న్ మంగ‌ళ్‌` పేరుతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని జ‌గ‌న్ శ‌క్తి రూపొందిస్తున్నారు. 2013లో భార‌త్ చేప‌ట్టిన `మంగ‌ళ్‌యాన్ మిష‌న్‌` నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా ద్వారా నిత్యామీన‌న్ బాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. ఆదివారం ఈ చిత్ర షూటింగ్ ముగిసింది. చివ‌రి రోజు షూటింగ్‌లో పాల్గొన్నాన‌ని, టీమ్ మొత్తం క‌లిసి వేసిన స‌ర‌దా జోకులు మిస్స‌వుతున్నాన‌ని నిత్యామీన‌న్ ట్విట్ట‌ర్‌లో స్పందించింది. సినిమాలో త‌న పాత్ర‌కు సంబంధించిన ఫొటోను షేర్ చేసింది. ఆమె ఈ చిత్రంలో వ‌ర్షా పిళ్లై అనే పాత్ర‌లో న‌టిస్తోంది. నిత్యామీన‌న్‌తో పాటు ఈ చిత్రంలో విద్యాబాల‌న్‌, సొనాక్షి సిన్హా, తాప్సీ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

Advertisement
CJ Advs

సినిమాలో కృతికా అగ‌ర్వాల్‌గా న‌టిస్తున్న తాప్సీ అంత‌కు ముందు రోజు ట్విట్ట‌ర్‌లో ఈ సినిమాపై ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టింది.  ఈ సినిమా ఓ అంద‌మైన ప్ర‌యాణం అని అభివ‌ర్ణించింది. `మ‌రో అంద‌మైన ప్ర‌యాణం ముగిసింది. `మిష‌న్ మంగ‌ళ్‌`కు సంబంధించి నా పాత్ర చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ప్ర‌తి సినిమా వ‌చ్చిపోతుంటుంది. కానీ కొన్ని మాత్ర‌మే ఓ గురువులా క‌లిసి ప‌నిచేయ‌డంలో వున్న మ్యాజిక్‌ను రుచిచూపిస్తుంటాయి. ఈ సినిమాలోని ప్ర‌తి ఫ్రేమ్‌లో అద్భుత‌మైన న‌టులున్నారు. `మిష‌న్ మంగ‌ళ్‌`ను చిర‌కాలం గుర్తుపెట్టుకుంటాను. ఆగ‌స్టు 15న ఈ చిత్రాన్ని సెల‌బ్రేట్ చేసుకుందాం` అని ట్వీట్ చేసింది. 

nithya menon first bollywood movie:

nithya menon in mission mangal
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs