Advertisement
Google Ads BL

మహేష్‌ జంట కనుల పండువగా ఉంది!


సినీ రంగంలో హీరోల డామినేషన్‌ ఎక్కువగా ఉంటుంది. అందుకే సినిమా మొదలవ్వడం నుంచి బిజినెస్‌ వరకు అంతా హీరోల క్రేజ్‌ మీదనే ఆధారపడి ఉంటాయి. అందుకే సినిమాల ప్రమోషన్స్‌లో హీరోలకు ఇచ్చిన ఇంపార్టెన్స్‌ హీరోయిన్లకు ఉండదు. కేవలం వారు గ్లామర్‌ డాల్స్‌గా మాత్రమే ఉంటారు. అయితే హీరోకి హీరోయిన్‌కి మధ్య కెమిస్ట్రీ పండాలన్నా, ఆ జంట చూడముచ్చటగా ఉంది అనిపించుకోవాలనుకున్నా, ప్రేక్షులను సినిమాలలోని పాత్రలలో ఇన్‌వాల్వ్‌ చేయాలన్నా హీరోలతో హీరోయిన్లు కలిసి ఉండే క్యూట్‌ ఫొటోలను రివీల్‌ చేయడం అవసరం. ఇప్పుడు మహేష్‌ టీం అదే పని చేస్తోంది. 

Advertisement
CJ Advs

మహేష్‌బాబు తన ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు, అశ్వనీదత్‌, పివిపిల నిర్మాణ భాగస్వామ్యంలో ‘మహర్షి’ చిత్రం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన రెండు మూడు మహేష్‌ లుక్స్‌ని విడుదల చేశారు. ఇందులో కాస్త గడ్డాలు, మీసాలు పెంచి మహేష్‌ అభిమానులను అలరించాడు. ఇక ఏప్రిల్‌ 25న ఈ మూవీ విడుదల కానుండటంతో ఇప్పటి నుంచే అభిమానులు కౌంట్‌డౌన్‌ చేశారు. ఇక సినిమా యూనిట్‌ కూడా ప్రమోషన్స్‌ని వేగవంతం చేయాలని నిర్ణయించుకుంది. 

దాంతో తాజాగా మహేష్‌బాబు, హీరోయిన్‌ పూజాహెగ్డేల స్టిల్‌ని విడుదల చేసింది. మహేష్‌-పూజాహెగ్డేల రొమాంటిక్‌ స్టిల్‌ అద్భుతంగా ఉంది. పూజా ఎంతో క్యూట్‌గా, ‘అరవిందసమేత వీరరాఘవ’ తరహాలోనే మరోసారి తన అందంతో చూపు మరల్చుకోలేని విధంగా కనిపిస్తోంది. నిజానికి మహేష్‌బాబు చిత్రాలలో ఎంత అందగత్తె అయినా హీరోయిన్‌ అయినా సరే మహేష్‌ డామినేషన్‌, క్యూట్‌, మిల్కీ బాయ్‌ లుక్‌ ముందు తేలిపోతారు. మహేష్‌తో పాటు హీరోయిన్లు కలిసి ఉండే సీన్స్‌లో కూడా పక్కన హీరోయిన్‌ని వదిలేసి మహేష్‌ని చూస్తూ ఉండిపోతారు. కానీ ‘మహర్షి’లో మాత్రం పూజాహెగ్డేతో మహేష్‌ జోడీని చూస్తుంటే ఇద్దరు మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌గా కనిపిస్తూ ఉండటం విశేషం. 

Pooja Hegde look Released from Maharshi:

Maharshi Movie Pooja Hegde look Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs