Advertisement
Google Ads BL

RRR: చరణ్‌కు ఫిక్సంట.. ఎన్టీఆర్‌కే..?


రాజమౌళి డైరెక్షన్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల RRR మూవీ సెకండ్ షెడ్యూల్ శరవేగంగా జరుపుకుంటుంది. మొదటి షెడ్యూల్ పూర్తి చేసాక రాజమౌళి ఒక నెల గ్యాప్ తీసుకుని సెకండ్ షెడ్యూల్ ని ఈ స్టార్ హీరోలతో మొదలుపెట్టేశాడు. ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా అంటే జక్కన్న ఈ సినిమాని ఎలా చెక్కుతాడో అనే కన్ఫ్యూజన్ మాత్రం లేదు. ఎందుకంటే జక్కన్న పర్ఫెక్ట్ గా సెట్స్ మీదకెళ్ళాడు అంటే ఆ సినిమా హిట్ అనేది ఆయన ట్రాక్ రికార్డు చెప్పకనే చెబుతుంది. అన్ని పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్నాకే జక్కన తన సినిమాని పట్టాలెక్కిస్తాడు.

Advertisement
CJ Advs

కాని ఈసారి హీరోయిన్స్ విషయంలో మీడియాకి గాని.. ప్రేక్షకులకు కానీ చిన్న క్లూ కూడా ఇవ్వకుండా షెడ్యూల్ మీద షెడ్యూల్ షూటింగ్ ని చిత్రీకరిస్తున్నారు. ఇక మీడియా మాత్రం RRR లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోయిన్స్ విషయంలో అనేక రకాల వార్తలను వండి వారుస్తుంది. అయినా హీరోయిన్స్ విషయంలో జక్కన్న కామ్ గానే ఉన్నాడు.. కానీ ఎక్కడా స్పందించడం లేదు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్స్ మీద జక్కన్న ఫోకస్ చేసాడనే న్యూస్ సోషల్ మీడియాలో నడుస్తుంది. అంతేకాకుండా రామ్ చరణ్ కి బాలీవుడ్ చిన్నది అలియా భట్ ఫిక్స్ అంటూ మీడియాలో వార్తలొస్తున్నాయి.

రాజీ సినిమాతో మంచి ఊపుమీదున్న అలియా భట్ అయితే చరణ్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని జక్కన్న భావిస్తున్నాడట. అయితే RRR లో అలియా భట్ అనే వార్తలు గత కొద్ది రోజులుగా మీడియాలో వినబడుతున్నాయి. కానీ తాజాగా RRR లో చరణ్ కి అలియా భట్ ఫిక్స్ కానీ.. ఎన్టీఆర్ కి ఇంకా హీరోయిన్ దొరకాలి అంటున్నారు. మరి రాజమౌళి, చరణ్ కి బాలీవుడ్ భామని తెచ్చి.. ఎన్టీఆర్ కి సౌత్ భామని తెస్తాడో.. లేదంటే.. ఎన్టీఆర్ కి కూడా బాలీవుడ్ భామనే తెస్తాడో అనేది చూడాలి.

Heroines Fixed for RRR Movie:

Alia Bhatt in Rajamouli RRR Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs