Advertisement
Google Ads BL

ఫస్ట్ లుక్: మహేష్‌తో పూజా రొమాంటిక్ హగ్


మహేష్ బాబు 25 వ చిత్రంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘మహర్షి’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈనెలలో షూటింగ్ కంప్లీట్ చేసి, షూటింగ్ అనంతర కార్యక్రమాలను పూర్తి చేసి ఏప్రిల్ 25న విడుదల చేయాలని మహేష్ అండ్ టీం ప్రయత్నం చేస్తుంది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే.

Advertisement
CJ Advs

ఈ సినిమాలో ఇప్పటివరకు పూజా హెగ్డే లుక్ వదల్లేదు. ఆదివారం ఈ చిత్రంలోని పూజా లుక్ ని రివీల్ చేశారు మేకర్స్. మహేష్ బాబు, పూజా హెగ్డేల రొమాంటిక్ స్టిల్‌ను విడుదల చేశారు. మహేష్‌ని ప్రేమగా హాగ్ చేసుకుని ఉన్న స్టిల్ చాలా క్యూట్‌గా ఉంది. ఎన్టీఆర్ అరవింద సమేత లో పూజా ఎలా అయితే కనిపించిందో ఇప్పుడు దాదాపు అదే మేకోవర్‌తో కనిపించబోతుంది.

మహేష్ మాత్రం కాస్త గడ్డం మీసాలతో కొత్తగా కనిపించబోతున్నాడు. ఇక ఈ చిత్రం కోసం పూజా హెగ్డే ఏకంగా 1.75 కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా టాక్. తెలుగులో వరసగా టాప్ హీరోస్‌తో నటిస్తున్న పూజాకు ఈ సినిమా మరింత హెల్ప్ అవుతుందని ఆశిస్తోంది.

Pooja Hegde Pic from Maharshi:

Mahesh Romantic Hug to Pooja!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs