Advertisement
Google Ads BL

‘ముద్ర’ విషయంలో ఎవరు వెనక్కి తగ్గారంటే?


గత కొన్ని రోజులు నుండి టాలీవుడ్ లో హీరో నిఖిల్ ముద్ర‌ సినిమా టైటిల్ పై వివాదం జరుగుతుంది. నిఖిల్ ప్రస్తుతం తమిళ సినిమా గ‌ణిద‌న్ ను తెలుగులో ముద్ర అనే పేరుతో చేస్తున్నాడు. ఇదే పేరుతో జ‌గ‌ప‌తిబాబు హీరోగా చాలా ఏళ్ల కింద‌ట సినిమా తీసిన న‌ట్టికుమార్.. దాన్ని ఇప్పుడు విడుద‌ల చేయ‌డంతో వ‌చ్చింది స‌మ‌స్య‌.

Advertisement
CJ Advs

దీన్ని నిఖిల్ సినిమాగానే ప్రమోట్ చేయడంతో ప్రేక్షకులు క‌న్ఫ్యూజ్ అయ్యారు. విషయం తెలిసిన నిఖిల్ తన ఆవేదనను సోషల్ మీడియాలో వెల్లడించాడు. దీనిపై ట్విట్ట‌ర్లో స్పందించాడు. అటు ప్రొడ్యూసర్ నట్టి కుమార్ లైన్లోకి వ‌చ్చి నిఖిల్ మీద రివర్సులో విమ‌ర్శ‌లు చేశాడు. దాంతో ఇది పెద్ద రచ్చ అయింది.

ఇక నిఖిల్ ఎందుకులే ఈ రచ్చ అని త‌న సినిమాకు టైటిల్ మార్చేయాల‌ని ఫిక్స‌య్యాడు. ఏమన్నా కొత్త టైటిల్ తనకు సజెస్ట్ చేయమని అభిమానుల్ని సూచ‌న‌లు కోరుతున్నాడ‌త‌ను. త్వ‌ర‌లోనే కొత్త టైటిల్ అనౌన్స్ చేసే అవ‌కాశ‌ముంది. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ లో ఉంది. తమిళ వెర్షన్ డైరెక్ట్ చేసిన టి.ఎన్.సంతోషే తెలుగులోనూ డైరెక్ట్ చేస్తున్నాడు. ఠాగూర్ మ‌ధు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ స‌ర‌స‌న లావ‌ణ్య త్రిపాఠి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. 

Nikhil Changes Mudra Title:

Young Hero Bows Down To Pressure  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs