Advertisement
Google Ads BL

క్రిష్‌పై కంగనా డైరెక్ట్ అటాక్..!


బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ అన్నట్లుగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా, టాలీవుడ్  డైరెక్టర్ క్రిష్ ల మధ్యన మణికర్ణిక మంట చల్లారేలా కనబడ్డం లేదు.  మణికర్ణిక సినిమా విడుదలయ్యింది మొదలు.. డైరెక్టర్ క్రిష్ కంగనా మీద ఆరోపణలు గుప్పిస్తున్నాడు. కంగనా మీద క్రిష్ చేస్తున్న ఆరోపణలకు కంగనా సమాధానం ఇవ్వడం లేదుకానీ.... కంగనా అక్క మాత్రం క్రిష్ ని ఎడా పెడా ట్విట్టర్ లో ఆడుకుంటుంది. క్రిష్ మాత్రం మణికర్ణిక నిర్మాతలు రెమ్యూనరేషన్ కూడా ఎగ్గొట్టేలా ఉన్నారని.. కంగనాకి తల పొగరెక్కువ అని మాట్లాడుతున్నాడు. అయినా కంగనా మాత్రం మణికర్ణిక విజయాన్ని ఆస్వాదిస్తోంది.

Advertisement
CJ Advs

స్విజ్జర్ల్యాండ్ లో కంగనా మణికర్ణిక విజయాన్నిఎంజాయ్ చేస్తుంది కానీ.... క్రిష్ ని ఎటాక్ చేసే విధంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ తాజాగా ఎయిర్ పోర్ట్ లో కంగానా ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు క్రిష్ కి చెప్పాల్సిన రీతిలో చెప్పేసింది. మాణికర్ణక సినిమాని నేనే డైరెక్ట్ చేశా.. అందులో ఎలాంటి మార్పు లేదు. ఒకవేళ క్రిష్ తానూ డైరెక్ట్ చేశానని చెబితే.. నిరూపించుకోమనండి అంటూ క్రిష్ మీద డైరెక్ట్ అటాక్ చేసింది. ఇక సోను సూద్, మిస్త్రీ చక్రవర్తి పాత్రలను మణికర్ణికలో కంగనా కట్ చేసింది అని వచ్చిన ఆరోపణలకు కంగనా తన స్టయిల్లో సమాధానం చెప్పింది.

నేను మణికర్ణికలో వారి పాత్రలను తీసేశానని చెబుతున్నవారికి నేను చెప్పేది ఒక్కటే... ఒక నటిగా... ఇప్పటివరకూ ఫిల్మ్‌మేకర్‌గా నేను మూడు జాతీయ అవార్డులు గెలుచుకున్నా. ఆ అవార్డులను నేను స్వయంగా సాధించా. మీరు కూడా ఈ స్థాయికి రావడానికి కష్టపడాలి కానీ.... మరొకర్ని చూసి ఏడిస్తే లాభం లేదు.... అలా ఏడుస్తున్న వారందరిని పెట్టి క్రిష్ ను మళ్లీ సినిమా తీసుకొమ్మనండి.. అంటూ ఘాటైన సంధానం ఇచ్చింది కంగనా.

Kangana Serious on Krish Allegations:

Kangana Ranaut Direct Attack on Director Krish
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs