నేచురల్‌స్టార్ నానిలోని టాలెంట్‌ని ఆయన విజయాల శాతంతో ముడిపెట్టలేం. ఏ పాత్రలో అయినా ఒదిగిపోయి నటించడం ఆయన సొంతం. అందుకే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా నేచురల్‌స్టార్‌గా ఎదిగాడు. తన సహజమైన నటనతో తెలుగులో వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ స్టార్‌గా, సంపూర్ణ నటునిగా ఎదుగుతున్నాడు. ఇటీవల ఆయన నటించిన ‘కృష్ణార్జునయుద్దం, దేవదాసు’ అనుకున్న విజయాలను అందించలేకపోవడంతో మరలా నాని ఆచితూచి కథలు ఎంచుకుంటున్నాడు. దాదాపు తెలుగులో పూర్తి స్థాయి స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ‘జెర్సీ’లో నటిస్తున్నాడు. ఏరికోరి గౌతమ్ తిమ్మనూరికి అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రంలో ఆయన రంజీ క్రికెట్ ప్లేయర్‌గా, వయసు మళ్లిన వయసులో పట్టుదలతో క్రికెటర్‌గా మారిన మధ్య వయస్కుడి పాత్రలో నటిస్తున్నాడు.
ప్రొఫెషఫనల్ ప్లేయర్స్ రిటైర్ అయ్యే వయసులో కెరీర్‌ని ప్రారంభించే క్రికెటర్ పాత్రతో రానున్నాడు. దీని అనంతరం ఆయన ఇంటెలిజెంట్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్‌తో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రం కథ నాని టాలెంట్‌ని సవాల్ విసిరే విధంగా ఉండనుందని సమాచారం. ఇందులో ఓ వ్యక్తి జీవితంలోని టీనేజ్ వయసులో అంటే 19ఏళ్ల టీనేజర్‌గా, 25 సంవత్సరాల యువకునిగా, 40ఏళ్ల మధ్యవయస్కుడిగా, 50 ఏళ్లు దాటిని సీనియర్ సిటిజన్‌గా నాలుగు షేడ్స్ ఉన్న పాత్రలో నటించనున్నాడట. ఈ తరహా చాలెంజ్ చిత్రాలు తెలుగులో అరుదే.
గతంలో ఒకరిద్దరు ఇలా ప్రయత్నించినా పూర్తిగా మెప్పించలేకపోయారు. అదే కోలీవుడ్ విషయానికి వస్తే కమల్, విక్రమ్, సూర్య, విజయ్‌సేతుపతి వంటి వారు వీటిని ఛాలెంజ్‌గా తీసుకుంటున్నారు. మరి తెలుగులో నాని వంటి వ్యక్తి ఏరికోరి ఇలాంటి సవాలు విసిరే కథను, పాత్రను ఒప్పుకోవడం అభినందనీయం. ఇందులో ఉన్న కొత్తదనం చూసే నాని ఈ మూవీకి ఓకే చెప్పాడట. సో.. నాని నుంచి రానున్న తదుపరి రెండు ‘జెర్సీ’, విక్రమ్ కె.కుమార్‌ల చిత్రాలు నాని ముందు పెద్ద సవాళ్లేనని చెప్పాలి.