Advertisement
Google Ads BL

బాలీవుడ్‌కు వెళుతున్న కార్తి సినిమా!


కార్తీ సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ ధీర‌న్ పాత్ర‌లో న‌టించిన కాప్ థ్రిల్ల‌ర్ `ధీర‌న్ అధిగారం ఒండ్రు`. బి.వినోద్ చిన్న మైన్యూట్ పాయింట్‌ని కూడా వ‌ద‌ల‌కుండా పోలీస్ ఇన్వేస్టిగేష‌న్ ఎలా వుంటుందో ఈ సినిమాతో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు. కాప్ థ్రిల్ల‌ర్‌ల‌లోనే రియ‌లిస్టిక్ అప్రోచ్‌తో రూపొందిన‌ మాస్ట‌ర్ పీస్‌గా నిలిచిందీచిత్రం. తెలుగు(ఖాకీ), త‌మిళ భాష‌ల్లో బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యంతో పాటు ప్ర‌శంస‌లు అందుకున్న ఈ సినిమాను బాలీవుడ్‌కు తీసుకుపోతున్నారు. త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో సూప‌ర్‌హిట్‌లుగా నిలిచిన చిత్రాల్ని హిందీలో చేసి బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాల్ని సొంతం చేసుకునే రోహిత్ షెట్టి `ధీర‌న్ అధిగారం ఒండ్రు` చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. 

Advertisement
CJ Advs

ఇటీవ‌లే  తెలుగు హిట్ చిత్రం `టెంప‌ర్`ని `సింబా` పేరుతో ర‌ణ్‌వీర్‌సింగ్ హీరోగా రీమేక్ చేసి హిట్‌ని సొంతం చేసుకున్న రోహిత్ షెట్టి బాలీవుడ్ నేటివిటీకి మార్పులు చేర్పులు చేసి రీమేక్ చేయ‌బోతున్నాడని తెలిసింది. ఇందులో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీర్ ధీర‌న్ పాత్ర‌లో అక్ష‌య్‌కుమార్ న‌టించ‌బోతున్నారు. ఇప్ప‌టికే త‌మిళ చిత్రం `ధీర‌న్ అధిగారం ఒండ్రు` రీమేక్ హ‌క్కుల్ని సొంతం చేసుకున్న రోహిత్ షెట్టి స్క్రిప్ట్‌లో త‌న మార్కు అంశాల్ని జోడించి మ‌రింత ఎఫెక్టీవ్‌గా హిందీ రీమేక్‌ని అందించ‌బోతున్నాడ‌ట‌. 

కాగా ఈ చిత్రానికి `సూర్య‌వంశీ` అనే టైటిల్‌ని కూడా ద‌ర్శ‌కుడు రోహిత్ షెట్టి ఫిక్స్ చేసిన‌ట్లు తెలిసింది. స్క్రిప్ట్ ప‌క్కాగా పూర్త‌యిన త‌రువాత ఈ చిత్రాన్ని ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి మొద‌లుపెట్టాల‌నే ఆలోచ‌న‌లో రోహిత్ షెట్టి వున్న‌ట్లు తెలుస్తోంది. అక్ష‌య్ కుమార్‌కు జోడీగా ఎవ‌రు ప‌టిస్తార‌నేది ఇంకా ఖ‌రారు కాలేదు. ఆ హీరోయిన్ ఎవ‌ర‌నేది త్వ‌ర‌లోనే రోహిత్ షెట్టి వెల్ల‌డించే అవకాశం వుంది. వ‌రుస రీమేక్‌ల‌తో బాలీవుడ్‌లో విజ‌యాలు సాధిస్తున్న రోహిత్ షెట్టికి `ధీర‌న్ అధిగారం ఒండ్రు` కూడా మ‌రో హిట్‌ని అందిస్తుంద‌ని గ‌ట్టి న‌మ్మ‌కంతో వున్నాడ‌ట‌. 

karthi khakee movie going to bollywood:

akshay kumar in khakee remake
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs