Advertisement
Google Ads BL

దిల్ రాజు షాకింగ్ నిర్ణయం.. త్వరలో ప్రకటన!


దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ ఫుల్ గా విజయాలను అందుకుంటూనే నిర్మాతగా మారి అనేక సినిమాలను నిర్మిస్తూ సక్సెస్ ఫుల్ నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. భారీ బడ్జెట్ చిత్రాల జోలికిపోకుండా మీడియం రేంజ్ చిత్రాలను నిర్మిస్తూ విజయాలను అందుకుంటున్నాడు. తాజాగా ఈ ఏడాది మొదటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని దిల్ రాజు అందుకున్నాడు. అయితే నిర్మాతగా బాగానే ఉన్నా.. ఈమధ్యన దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా బాగా దెబ్బతింటున్నాడు. చిన్న పెద్ద సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దిల్ రాజు పెద్ద సినిమాల దెబ్బకి  విలవిలలాడుతున్నాడు. నిర్మాతగా సంపాదిస్తున్న సొమ్ముని డిస్ట్రిబ్యూటర్ గా పోగొట్టుకుంటున్నాడు.

Advertisement
CJ Advs

డిస్ట్రిబ్యూటర్ గా వరసగా ఫెయిల్యూర్స్ బాధించడంతో.. దిల్ రాజు ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లుగా సోషల్ మీడియా కోడై కూస్తుంది. అదేమిటంటే.. దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ కి బై బై చెప్పబోతున్నట్లుగా చెబుతున్నారు. తాజాగా డిస్ట్రిబ్యూటర్ గా చాలా లాస్ రావడంతోనే దిల్ రాజు ఇలాంటి షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. నిర్మాతగా ఎఫ్ 2 తో విజయం అందుకున్న దిల్ రాజు ఇలాంటి డెసిషన్ కి రావడం కాస్త షాకింగ్. ఎందుకంటే దిల్ రాజు ఏ సినిమా అయినా కొని విడుదల చేస్తున్నాడు అంటే.. ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలుండేవి. ఇక దిల్ రాజు కొన్నాకే చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ ఆ సినిమాని కొనడానికి ముందుకొస్తారు.

మరి నిర్మాతగా విజయాలను ఆస్వాదిస్తున్న దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా డబ్బు పోగొట్టుకోవడం ఎందుకులే అని.. అలా డిస్ట్రిబ్యూటర్ గా తాను ఇక ఉండదలుచుకోలేదని తెలుస్తుంది. త్వరలోనే దిల్ రాజు ఈ విషయాన్నీ మీడియాతో పంచుకునే అవకాశం ఉందన్నట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే దిల్ రాజు లాంటి బడా డిస్ట్రిబ్యూటర్ ఇలా అంటే ఎలా అంటూ చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ తలలు పట్టుకుంటూ... రాజుగారు మీరే ఇలా అంటే ఎలా అంటున్నారట.

Dil Raju Takes Shocking Decision :

Dil Raju says Goodbye to Distribution
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs