బాహుబలి సిరీస్ తో రాణా సాధించుకున్న క్రేజ్ కి మరో దశాబ్ధం వరకూ మనోడికి అడ్డనేది ఉండదని అందరూ ఫిక్స్ అయిపోయారు. రాణా కూడా కేవలం హీరోగా మాత్రమే చేస్తానని పట్టుబట్టకపోవడం వలన నెగిటివ్ రోల్స్, సపోర్టింగ్ రోల్స్ ఆఫర్లు చాలా వస్తున్నాయి రాణాని వెతుక్కుంటూ. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, హిందీ భాషల్లోనూ రాణా మోస్ట్ వాంటెడ్ యాక్టర్. అందుకే రాణా డేట్స్ కోసం అన్నీ ఇండస్ట్రీల నుంచి దర్సకనిర్మాతలు వెయిట్ చేస్తున్నారు. అయితే.. ఇంత బిజీ స్టార్ డేట్స్ ను సి.కళ్యాణ్ వేస్ట్ చేశాడు. "జై సింహా, ఇంటెలిజంట్" సినిమాలు రూపొందిస్తున్న సమయంలోనే సి.కళ్యాణ్ రాణాతో 1945 అనే సినిమాను కూడా మొదలెట్టాడు. రెండో ప్రపంచ యుద్ధం నేపధ్యంలో సాగే ఈ చిత్రంలో రాణా ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడని టాక్ వచ్చింది. ఈ సినిమా కోసం రాణా లుక్స్ కూడా వైరల్ అయ్యాయి.
మరి ఇంటెలిజెంట్ ఫ్లాప్ తో ఢీలాపడ్డాడో ఏమో తెలియదు కానీ.. సడన్ గా ఆ సినిమా ప్రోడక్షన్ ను పక్కన పెట్టేశాడు సి.కళ్యాణ్. దాంతో రాణా కూడా ఆ ప్రొజెక్ట్ ను లైట్ తీసుకొని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న హాతీ మేరా సాతీ సినిమాపై దృష్టి సారించాడు. ఈ ఏడాది విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంలో రాణా చాలా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు.
ఇకపోతే.. రాణాబాబుకి టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ల నుంచి మాత్రమే కాదు ఏకంగా హాలీవుడ్ నుంచి కూడా పిలుపు వచ్చిందట. ఒక హాలీవుడ్ యాక్షన్ ఫిలిమ్ లో చిన్న పాత్ర కోసం రాణాను సంప్రదించగా ఆలోచించుకొని చెబుతా అన్నాడట. తన డేట్స్ ను చెక్ చేసుకొని తాను ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు ఎలాంటి ఇబ్బంది లేకపోతే ఆ హాలీవుడ్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు రాణా బాబు.