Advertisement
Google Ads BL

దర్శకుడు క్రిష్.. ఇంక ఆపితే బెటర్..!


ప్రస్తుతం దర్శకుడు క్రిష్ మహానాయకుడు సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా తలమునకలై ఉంటాడనుకున్నారు అంతా. అయితే నిజంగా క్రిష్ అలానే ఉండేవాడు. ఎదుకంటే మణికర్ణికను పక్కనబెట్టి... వచ్చినప్పటి నుండి ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు షూటింగ్ ని ఎంతో శ్రద్దగా కేవలం ఐదారు నెలల్లోనే పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు క్రిష్. ఎన్టీఆర్ బయోపిక్ ని ఒక మహాయజ్ఞంలా పూర్తి చేశాడు. అయితే కథానాయకుడు సినిమాని అనుకున్న టైంకి ప్రేక్షకుల ముందుకు తెచ్చిన క్రిష్.. ఆ సినిమాకి కలెక్షన్స్ రాకపోవడానికి కారణమయ్యాడా...? అదేమో తెలియదు కానీ... మహానాయకుడు మాత్రం అనుకున్న టైంకి విడుదల కాకపోవడానికి క్రిష్ కారణం అంటున్నారు.

Advertisement
CJ Advs

ప్రస్తుతం మహానాయకుడు షూటింగ్ చిత్రీకరణలో ఉండాల్సిన క్రిష్.. తాను బాలీవుడ్ లో తెరకెక్కించిన మణికర్ణిక సినిమా విషయంలో కంగనా రనౌత్ మీద నిప్పులు చెరిగే పనిలో బిజీగా వున్నాడు. మణికర్ణిక సినిమాని తాను డైరెక్ట్ చేస్తే కంగనా దర్శకత్వం పేరులో తన పేరు వేసుకుంది.... తాను మణికర్ణిక సినిమాని బంగారంలా చేస్తే కంగనా దాన్ని ఇత్తడిలా మార్చేసిందంటూ హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నాడు. మణికర్ణిక సినిమా విడుదలకు ముందు గమ్మునున్న క్రిష్ ఆ సినిమా విడుదలయ్యాక కంగనా మీద ఫైర్ అవుతున్నాడు. మరోపక్క కథానాయకుడు సినిమా దెబ్బకి..  మహానాయకుడులో పర్ఫెక్షన్ తో పాటుగా లెన్త్ తగ్గించే పనిలో మళ్ళీ రీషూట్స్ చేస్తున్నారనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. 

కథానాయకుడులో మిస్ అయిన ఎమోషన్స్, కామెడీ అన్ని మహానాయకుడిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అందుకే కొన్ని సన్నివేశాలని మళ్ళీ రీషూట్స్ చేస్తున్నట్లుగా టాక్. ఇక సోషల్ మీడియాలో మహానాయకుడి మహా రిపేర్లు అంటూ కొంతమంది నెగెటివ్ ప్రచారానికి రెడీ అవుతున్నారు. అయితే క్రిష్ కథానాయకుడు సినిమా విషయంలో అయినట్లుగా కాకుండా మహానాయకుడు మీద మనసు పెట్టాలని.. విడుదలైపోయి ప్లాప్ అయిన మణికర్ణిక విషయంలో కాస్త తగ్గితే బావుంటుందని నందమూరి  అభిమానుల అభిప్రాయం. మణికర్ణిక విషయం పక్కన పెట్టకపోతే మహానాయకుడుకి చేటు జరగడం ఖాయమంటున్నారు. ఇక మహానాయకుడు సినిమా ఫిబ్రవరి 7 న విడుదలవ్వాల్సి ఉండగా... ఇప్పుడు ఫిబ్రవరి 22 న మహానాయకుడు విడుదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు.

Krish Plz.. Stop that controversy: Nandamuri Fans:

Director Krish Interest on Manikarnika Controversy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs