Advertisement
Google Ads BL

లక్ష్మీరాయ్ పాపా నీకేదంటే ఇష్టం..!


షూటింగ్ పూర్తి చేసుకున్న లక్ష్మీరాయ్ ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మి’ చిత్రం.

Advertisement
CJ Advs

లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మి’.. రామ్ కార్తిక్ , పూజిత పొన్నాడ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.. హార్రర్ కామెడీగా  తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేస్తుంది.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. కాగా ఇటీవలే ఈ చిత్రం నుంచి వచ్చిన ‘పాపా నీకేదంటే ఇష్టం’ పాటకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుంది.. మాస్ హంగులు జోడించి ఈ పాటను చిత్రీకరించారు.. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రాగా, త్వరలో టీజర్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్మాతలు.. ఈ చిత్రంలో నటిస్తున్న హాస్యనటులు ప్రవీణ్, మధునందన్ ల కామెడీ హైలైట్ గా నిలవనుంది..  హరి గౌర ఈ చిత్రానికి సంగీతం అందించగా, వెంకట్ ఆర్. శాఖమూరి సినిమాటోగ్రఫీని అందించారు.. ఏబీటి క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై గురునాథ్ రెడ్డి సమర్పిస్తున్న ఈ సినిమాకి ఎం.శ్రీధర్ రెడ్డి, హెచ్.ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డిలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.. మార్చిలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. 

నటీనటులు: రాయ్‌లక్ష్మీ, ప్రవీణ్, మధు నందన్, రామ్ కార్తిక్, పూజిత పొన్నాడ, బ్రహ్మాజీ, పంకజ్ కేసరి, అన్నపూర్ణమ్మ, జబర్దస్త్ మహేష్, జెమినీ సురేష్ తదితరులు..

సాంకేతిక నిపుణులు :

దర్శకత్వం : కిషోర్ కుమార్

నిర్మాతలు: ఎం.శ్రీధర్ రెడ్డి , హెచ్.ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి

బ్యానర్ : ఏబీటి క్రియేషన్స్ 

సమర్పణ : గురునాథ్ రెడ్డి 

సినిమాటోగ్రఫీ : వెంకట్ ఆర్.శాఖమూరి

మ్యూజిక్ : హరి గౌర

కథ, కథనం, మాటలు : తాటవర్తి కిరణ్

ఎడిటర్ : ఎస్.ఆర్. శేఖర్

ఆర్ట్ : బ్రహ్మ కడలి

ఫైట్స్ : రామ్ సుంకర

డాన్స్ మాస్టర్ : శేఖర్

PRO : వంశీ-శేఖర్

Lakshmi Rai Where is Venkatalakshmi Shooting Update:

Raai Lakshmi Where is Venkatalakshmi Shooting completed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs