Advertisement
Google Ads BL

ఎవడండీ త్రివిక్రమ్.. అది డిసైడ్ చేయడానికి


హీరోల్లో వెంకటేష్ కి యాంటీ ఫ్యాన్స్ లేనట్లు.. డైరెక్టర్స్ లో యాంటీ ఫ్యాన్స్ లేని వాళ్ళలో వినాయక్ తర్వాత స్థానం త్రివిక్రమ్ దే. అందరూ ముద్దుగా గురూజీ అని పిలుచుకునే త్రివిక్రమ్ మీద సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ ప్రముఖ యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమధ్యకాలంలో త్రివిక్రమ్ సినిమాల్లో కనిపించకపోవడానికి కారణం ఏంటి అని అడగగా.. ఏమాత్రం సంకోచించకుండా.. "జులాయి సినిమా వరకూ ఆయన అన్నీ సినిమాల్లో నటించాను. ఆ తర్వాత ఒక సినిమా విషయంలో నా రెమ్యూనరేషన్ ఎంత అనేది ఆయన ఫిక్స్ చేస్తారంట. అసలు హేమకి అంత రెమ్యూనరేషన్ ఎందుకు? అని వారించడంతోపాటు ఆమె రెమ్యూనరేషన్ తగ్గించాలని కూడా సూచించాడట. దాంతో కోపం వచ్చిన హేమ అప్పట్నుంచి త్రివిక్రమ్ సినిమాల్లో నటించడం మానేసింది. 

Advertisement
CJ Advs

అలాగే.. బోయపాటితోనూ చిన్నపాటి గొడవ అయ్యిందట హేమకి. ఒకానొక షూటింగ్ టైమ్ లో కాస్త దిగులుగా కూర్చున్న హేమను చూసిన బోయపాటి వెంటనే వెటకారంగా ప్రొడక్షన్ వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారులేమ్మా ఎందుకలా దిగాలుగా కూర్చుంటావ్ అన్నాడట. షూటింగ్ పూర్తయ్యేవరకూ సైలెంట్ గా ఉన్న హేమ.. షూటింగ్ పూర్తయిన మరుక్షణం బోయపాటి మీద పంచ్ వేసిందట. ఈ విషయాన్ని కూడా స్వయంగా హేమ చెప్పడం విశేషం. ఇలా స్టార్ డైరెక్టర్స్ అందరితోనూ గొడవలు పడడమే కాక ఒక మాట పడడానికి ఇష్టపడకపోవడం వల్లే తనకు ఈమధ్యకాలంలో ఆఫర్లు తగ్గాయని చెప్పుకొచ్చింది హేమ. అలాగే.. ఇండస్ట్రీలో తనతో ఇప్పటివరకు ఎవరూ తేడాగా బిహేవ్ చేసే సాహసం చేయలేదని కూడా చెప్పుకొచ్చింది హేమ. ఇన్నాళ్లపాటు ఇండస్ట్రీతోపాటు, మా అసోసియేషన్ లోనూ భాగస్వామి అయిన హేమ ఇలా ఇన్నాళ్ల తర్వాత ఉన్నట్లుంది ఓపెన్ అప్ అవుతుండడంతో ఆమె ఇంకెన్ని ఇంటర్నల్ విషయాలు బయటపెడుతుందో, పెట్టిందో అనే భయం మొదలైంది ఇండస్ట్రీ వర్గాల్లో. 

Artist Hema Fires on Trivikram:

Who the Hell is Trivikram to decide her remuneration asks Hema 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs